Nivetha Thomas : ఇంత బూతుగా ఆలోచిస్తారా? నివేదా థామస్ ఫొటోపై ట్రోలింగ్... వైరల్ పోస్ట్!
సోషల్ మీడియాలో కాలంలో ఎవరు ఎప్పుడు ఎందుకు ట్రోల్స్ గురవుతారో తెలియదు. కావాలని చేస్తారా? తెలియక చేస్తారా? అనేది కూడా అర్థం కాదు.. సరిగ్గా ఇలాంటిదే నివేదా థామస్ విషయంలో జరిగింది.
యంగ్ హీరోయిన్ నివేతా థామస్ Nivetha Thomas చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన సినిమాలతో కంటే నెట్టింటే బాగా అలరిస్తున్నారు.
ఫన్నీ వీడియోలు క్యూట్ ఫొటోలను పంచుకుంటూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ తన అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. మరింగా క్రేజ్ పెంచుకుంటున్నారు.
ఇక నివేదా ప్రస్తుతం పెద్దగా సినిమాల జోరును చూపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరుచుగా ఫొటోలు పెడుతూ వస్తోంది. అలాగే క్యూట్ క్యూట్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది.
తాజాగా మరో ఫొటోను పంచుకుంది. దానికి బ్యూటీఫుల్ మెలోడీ టోన్ ను యాడ్ చేసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఆకట్టుకుంది. కానీ ఉన్నట్టుండి ఈ ఫొటోను కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు.
నివేదా ఇచ్చిన స్టిల్ ను బూతుగా అర్థం చేసుకున్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ.. ఎక్కడా తన పరిధి దాటని నివేదాను ట్రోల్ చేయడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది. ఇటీవల రష్మిక డీప్ ఫేక్ పై చర్యలు తీసుకున్నటే.. ఇలాంటి కామెంట్లనూ అడ్డుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నివేతా పంచుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు వల్గర్ గా కామెంట్లు పెడుతుంటే.. ఫ్యాన్స్ మాత్రం నివేదాను సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు లో మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.