తెలుగు చదవడం రాదన్న మంచు లక్ష్మీ, దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ మొత్తం మీద దారుణంగా ట్రోల్స్ ఫేస్ చేసేది మంచు ఫ్యామిలీ ఒక్కటే. అటు మంచువారిు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. .ముఖ్యంగా మంచు లక్మీ బాషపై భయంకరమైన మీమ్స్ చూస్తూనే ఉంటామ్. అలాంటి వాటికి తావిచ్చేలా మంచు రత్నాలు కూడా మాట్లాడుతుంటారు. ఇక మరోసారి మంచు వారి ఆడపడుచుపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.. ఎందుకంటే..?

టాలీవుడ్ కు ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు.. ఇక్కడ రాణిస్తున్నారు. ఇక్కడి భాషను పట్టుపట్టి నేర్చుకుంటున్నారు. తెలుగు వారు కాకపోయినా.. మన భాషమీద మమకారం చూపిస్తున్నారు. కాని ఇక్కడ తెలుగు వారు మాత్రం మన భాష రాదు అంటూ చెప్పి విమర్షలకు గురవుతున్నారు. ముఖ్యంగా స్టార్ యాక్టర్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తనకు తెలుగు రాదు అని చెప్పి విమర్షల పాలు అవుతున్నారు.
తనకు తెలుగు రాదని, ముఖ్యంగా చదవండం అస్సలు చేతకాదని ఆమె చెప్పడం పై సోషల్ మీడియాలో చాలామంది తెలుగు నెటిజన్స్ వివిధ రకాల కామెంట్లతో మంచు లక్ష్మి ని ట్రోల్ చేస్తున్నారు.. రీసెంట్ గా మంచు లక్ష్మీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విమర్షలకు దారి తీస్తున్నాయి.
టాలీవుడ్ లో మంచు లక్ష్మికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఆమె మాట్లాడే భాషకు సపరేట్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు భాషకు అమెరికన్ యాస కలిపి ఆమె మాట్లాడుతుంటే తెగ ఎంజాయ్ చేస్తుంటారు నెటిజన్లు. అయితే మంచు వారి అమ్మాయి ఇలా మాట్లాడటం చాలా మందికి నచ్చుతుంది.. మరికొంత మంది మాత్రి విమర్షిస్తుంటారు.
ఇంతకీ మంచువారి అమ్మాయి ఏం మాట్లాడిందంటే... ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో తన భాష పై తానే ఒక సెటైర్ వేసుకుంది. నేను పెరిగిన వాతావరణం వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అంటూ చెప్పుకొచ్చింది. ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసిన వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తానని అంటోంది మంచు లక్ష్మి.
ఈ మధ్య అసలు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి ఇలా అన్నారు. నేను సినిమాలు ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను. వెబ్ సిరీస్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అందులో ఎంజాయ్ ఉంటుంది. నాకు నచ్చినప్పుడు నేను చేయవచ్చు లిమిట్స్ ఏమీ ఉండవు, నా డేట్స్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు, మా పాపను కూడా చాలా బాగా చూసుకో వచ్చు సమయం దొరుకుతుందని అని అసలు కారణం చెప్పారు మంచు లక్ష్మి.
ఫ్యామిలీ లైఫ్ కోసం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నానని, పాప పెరిగిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానంటోంది మంచు లక్ష్మీ. అయితే ఈ స్టార్ బ్యూటీ చేసిన కామెంట్స్ తో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నేళ్ల బట్టి టాలీవుడ్ లో ఉంది ఇంకా తెలుగు రాకపోవడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.