MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రవితేజ కు సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ తో గోపీచంద్

రవితేజ కు సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ తో గోపీచంద్

  గోపీచంద్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి.  

2 Min read
Author : Surya Prakash
Published : Jul 24 2024, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


గోపిచంద్   సరైన సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని  చేసిన భీమా సినిమా( Bhimaa Movie )తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో ఏ సినిమా చేయాలి. ఎలాంటి సినిమాతో తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే డైలమోలో గోపిచంద్ ఉన్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల  దర్శకత్వంలో సినిమా చేస్తున్న గోపీచంద్ తన తదుపరి చిత్రానికి డైరక్టర్ ని  ఖరారు చేసినట్లు సమచారం. ఓ కామెడీ ఎంటర్టైనర్ తో రావటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు గోపిచంద్. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


గోపిచంద్ టాలెంట్ పరంగా ఎక్కడా వంక పెట్టడానికి లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మెప్పించారు గోపీచంద్. జయం, వర్షం, నిజం సినిమాలతో తన విలనిజాన్ని చూపి ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసి మెప్పించారు గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ఆ తర్వాత ఫ్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి. 

37


అయితే ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన గోపీచంద్ మాత్రం సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు ఈ టాల్ హీరో.  ఈ క్రమంలో రవితేజతో ధమాకా వంటి సూపర్ హిట్ ఇచ్చిన నక్కిన త్రినాధరావుతో సినిమా చేయటానికి కథను ఓకే చేసినట్లు సమాచారం. సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు చాలా కాలం క్రితమే గోపిచంద్ కు అడ్వాన్స్ ఇచ్చి డైరక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వాళ్లకు నక్కిన త్రినాధరావు చెప్పిన కథ నచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ ప్రాజెక్టు మొదలు కానుంది.  

47


ఏదైమైనా ఇప్పటికైనా గోపీచంద్ ఒకసారి డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తే తప్ప ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కదు.ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్న పర్లేదు కానీ ఇప్పుడు ఒక మంచి స్టోరీ తో వచ్చి సక్సెస్ కొడితేనే ఆయనకు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ తో ముందుకు వెళ్తున్నారు.
 

57

స్టార్  హీరోకు కావాల్సిన అన్ని అర్హతలు గోపీచంద్ (Gopichand)కు ఉన్నాయి. హైట్, ఫిట్ నెస్, గ్లామర్ అన్నీ ఉన్నాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. కొన్ని హిట్ చిత్రాలతో సత్తా ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన కేరీర్ అనుకున్నట్టుగా ఉంటే ఈ పాటికి పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు వచ్చేదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం గోపీచంద్ ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

67


ఇక 'ధమాకా’ (Dhamaka) చిత్రం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నుంచి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్‌ అనే బ్యానర్‌ స్థాపించారు. కొత్తవారితో 'చౌర్యపాఠం’ అనే సినిమా  నిర్మించారు.  ఆలాగే ఆయన మళ్ళీ మెగాఫోన్‌ పట్టుకుని షూటింగ్ చేస్తున్నారు.  ఇటీవల 'ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో విజయం అందుకున్న సందీప్‌ కిషన్‌తో (Sundeep kishan) త్రినాధరావు ఓ సినిమా చేస్తున్నారు. ఇదొక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది.

77


ఈ చిత్రానికి ‘మజాకా ‘అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 'ధమాకా’కి  మాస్‌ పాటలు ఇచ్చిన భీమ్స్‌ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు డీవోపీ. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్‌, సామజవరగమన తీసిన హాస్య మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image2
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image3
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved