డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన స్టార్ హీరోలు
First Published Aug 28, 2019, 1:05 PM IST
జయాపజయాలు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ వరుస డిజాస్టర్స్ అందితే హీరోల కెరీర్ పై అది చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆ లిస్ట్ టాలీవడ్ లో పెద్దగానే ఉంది. డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన వారిలో ఎక్కువ యువ హీరోలే ఉన్నారు. అందులో కొంతమంది నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం పదండి.

అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

రవితేజ: రాజా ది గ్రేట్ అనంతర సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకున్న మాస్ రాజా మళ్ళీ నెల టిక్కెట్టు - టచ్ చేసి చూడు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు డిస్కో రాజా అనే సైన్స్ ఫిక్చన్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టపడుతున్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?