- Home
- Entertainment
- Bheemla Nayak:టాలీవుడ్ టాప్ ఫస్ట్ వీక్ గ్రాసర్స్... పవన్ భీమ్లా నాయక్ పొజిషన్ తెలిస్తే షాక్ అవుతారు
Bheemla Nayak:టాలీవుడ్ టాప్ ఫస్ట్ వీక్ గ్రాసర్స్... పవన్ భీమ్లా నాయక్ పొజిషన్ తెలిస్తే షాక్ అవుతారు
భారీ అంచనాల మధ్య విడుదలైన భీమ్లా నాయక్ (Bheemla Nayak)మొదటి వారం పూర్తి చేసుకుంది. మరి భీమ్లా నాయక్ బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటీ? టాప్ టెన్ చిత్రాల జాబితాలో ఎక్కడ ఉందో చూద్దాం..

భీమ్లా నాయక్ అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైంది. టికెట్స్ ధరలతో పాటు తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ రీసెంట్ రిలీజ్ వకీల్ సాబ్ ని కూడా భీమ్లా నాయక్ దాటలేదు. వకీల్ సాబ్ విడుదల సమయంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉండటం విశేషం. మరి టాలీవుడ్ ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఏమిటో చూద్దాం...
ఇండియన్ బాక్సాఫీస్ ని దున్నేసిన బాహుబలి 2 స్థానం ఎప్పటికీ పదిలమే. రాజమౌళి, ప్రభాస్ (Prabhas)కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు వెర్షన్ ఏపీ,తెలంగాణలో కలిపి రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి రూ. 117.92 కోట్ల షేర్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుంది.
అల వైకుంఠపురంలో చిత్రంతో కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.93 కోట్ల షేర్ వచ్చింది. ఫస్ట్ వీక్..విపరీతంగా పుంజుకొని ఈ సినిమా రూ. 88.25 కోట్ల షేర్ రాబట్టింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో రెండో స్థానంలో ఉంది.
2020 మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు(Mahesh babu), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్లు షేర్ వసూలు చేసింది. ఫస్ట్ వీక్ రూ. 84.82కోట్ల షేర్ సాధించి మూడో ప్లేస్‌లో నిలిచింది.
చిరంజీవి నటించిన పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి (Chiranjeevi)హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజే రూ. 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణలో రూ. 84.49 కోట్ల షేర్ సాధించింది.
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. దీంతో సాహో చిత్రంపై విపరీతమైన హైప్ ఏర్పడింది. సాహో మొదటి రోజే రూ. 36.52 కోట్లు షేర్ వసూలు చేసింది. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లు బాగా నెమ్మదించాయి. మొత్తంగా సాహో ఫస్ట్ వీక్ తెలంగాణ, ఏపీలో రూ. 74.92 కోట్ల షేర్ సాధించింది.
మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వకీల్ సాబ్ చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.24 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణలోకలిపి రూ. 72.28 కోట్ల షేర్ సాధించింది.
వకీల్ సాబ్ కి మించిన హైప్, క్రేజ్ భీమ్లా నాయక్ కి ఏర్పడింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడం, సినిమా ప్రోమోలు, సాంగ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఇక భీమ్లా నాయక్ (Bheemla Nayak)కలెక్షన్స్ చూస్తే... మొదటి రోజు 26.42 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీక్.. రూ. 70.40 కోట్ల షేర్ సాధించింది.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. హిందీలో కూడా అదరగొట్టిన పుష్ప మొదటిరోజు రూ. 24.90 కోట్ల తెలంగాణ, ఏపీలో షేర్ సాధించింది. ఇక ఫస్ట్ వీక్‌లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రూ. 67.24 కోట్ల షేర్ సాధించింది.
Image: Still from the song
ప్రభాస్ బాహుబలి 1 మూవీ తెలంగాణ, ఏపీలో ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ. 23 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా వారం రోజుల్లో రూ. 61.40 కోట్ల తెలంగాణ,ఏపీలో షేర్ సాధించింది.
మహేష్ బాబు 25వ సినిమాగా విడుదలైన మహర్షి సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. తెలంగాణ, ఏపీలో మహర్షి మూవీ రూ. 22 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ తెలంగాణ,ఏపీలో రూ. 59.07 కోట్ల షేర్ సాధించింది.