MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే

Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే

టాలీవుడ్ లో ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. కానీ తొలి చిత్రంతోనే బలమైన ముద్ర వేస్తూ, ప్రేక్షకులకు అద్భుతమైన కథ అందించిన హీరోలు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2026, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Tollywood
Image Credit : Asianet News

Tollywood

చిత్ర పరిశ్రమలోకి స్టార్ హీరోల కొడుకులు, తమ్ముళ్లు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. అక్కినేని, నందమూరి, కొణిదెల, దగ్గుబాటి ఫ్యామిలీల నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్ళ తొలి చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. చాలా మంది హీరోలు ఫస్ట్ మూవీ సక్సెస్ కావాలి అనే కోరికతో సేఫ్ గేమ్ ఆడారు. బలమైన కథతో మెప్పించిన హీరోలు మాత్రం చాలా తక్కువ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కృష్ణ వారసుడిగా మహేష్ బాబు
Image Credit : Instagram/Mahesh Babu

కృష్ణ వారసుడిగా మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు. ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు తొలి చిత్రంతో సేఫ్ గేమ్ ఆడారు అనే చెప్పాలి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు చిత్రం పక్కా కమర్షియల్ ప్యాకేజ్ మూవీ. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఎస్ఎంఎస్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది ఒక నార్మల్ యూత్ ఫుల్ చిత్రం.

Related Articles

Related image1
Chiranjeevi: హిందీ సినిమా చేస్తూ నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్ అని చెప్పిన చిరు..ఆ హీరో దశ తిరిగింది
Related image2
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
38
చిరంజీవి తమ్ముడు, తనయుడు, మేనల్లుళ్ల తొలి చిత్రాలు
Image Credit : Asianet News

చిరంజీవి తమ్ముడు, తనయుడు, మేనల్లుళ్ల తొలి చిత్రాలు

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా కొత్త హీరోలు వచ్చారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ నిరాశపరిచింది. మేనల్లుడు అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో, తనయుడు రాంచరణ్ చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఇవి కమర్షియల్ గా సక్సెస్ కానీ దమ్మున్న సినిమాలు అయితే కాదు. వరుణ్ తేజ్ ముకుంద చిత్రంతో, సాయిధరమ్ తేజ్ రేయ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. కానీ వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన మూవీ ఒక అద్భుతం అనే చెప్పాలి. తొలి చిత్రంతోనే సాహసోపేతమైన కథని ఎంచుకున్న వైష్ణవ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

48
అక్కినేని వారసులు వీళ్ళే
Image Credit : Youtube

అక్కినేని వారసులు వీళ్ళే

ఏఎన్నార్ వారసత్వంతో నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని స్టార్ గా ఎదిగారు. నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇంకా టాలీవుడ్ లో స్ట్రగుల్ అవుతున్నారు. చైతు జోష్ చిత్రంతో, అఖిల్ అక్కినేని 'అఖిల్' మూవీతో హీరోలుగా పరిచయం అయ్యారు. అవి చెప్పుకోదగ్గ సినిమాలు కాదు.

58
తాతకి తగ్గ మనవడిగా తారక్
Image Credit : Asianet News

తాతకి తగ్గ మనవడిగా తారక్

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తాతకి తగ్గ మనవడు అని అనిపించుకున్నారు. కానీ తారక్ హీరోగా పరిచయమైన తొలి చిత్రం నిన్ను చూడాలని డిజాస్టర్ గా నిలిచింది.

68
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విలక్షణ నటుడు
Image Credit : our own

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విలక్షణ నటుడు

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి లీడర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఒకవైపు తండ్రి సపోర్ట్, మరోవైపు బాబాయ్ వెంకటేష్ క్రేజ్ తోడున్నప్పటికీ రానా కమర్షియల్ మూవీ జోలికి వెళ్ళలేదు. తొలిచిత్రంతోనే పొలిటికల్ స్టోరీ ఎంచుకున్నారు. నటనలో కూడా అదరగొట్టేశాడు రానా. లీడర్ దమ్మున్న సినిమా అనే చెప్పాలి.

78
మంచు హీరోల తొలి చిత్రాలు
Image Credit : Instagram

మంచు హీరోల తొలి చిత్రాలు

మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విష్ణు అనే మూవీతో మంచు విష్ణు హీరోగా పరిచయమయ్యాడు. మంచు మనోజ్ దొంగ దొంగది చిత్రంతో హీరో అయ్యాడు.

88
రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్
Image Credit : Asianet News

రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత పెదనాన్న అండదండలతో ప్రభాస్ క్రేజీ హీరోగా ఎదిగారు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్.

ఓవరాల్ గా టాలీవుడ్ లోకి ఎంత మంది వారసులు వచ్చినా తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేస్తూ, అద్భుతమైన కథని ఎంచుకున్న హీరోలు ఇద్దరే. ఒకరు రానా దగ్గుబాటి, మరొకరు వైష్ణవ్ తేజ్.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Recommended image2
Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?
Recommended image3
Nagabandham 3 days Collections: 3 రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్‌ కలెక్షన్లు
Related Stories
Recommended image1
Chiranjeevi: హిందీ సినిమా చేస్తూ నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్ అని చెప్పిన చిరు..ఆ హీరో దశ తిరిగింది
Recommended image2
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved