- Home
- Entertainment
- దివ్య భారతి, సౌందర్య, ఆర్తి అగర్వాల్.. ఫిల్మ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే హఠాత్తుగా మరణించిన సినీ తారలెవరు...?
దివ్య భారతి, సౌందర్య, ఆర్తి అగర్వాల్.. ఫిల్మ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే హఠాత్తుగా మరణించిన సినీ తారలెవరు...?
సినీతారల జీవితాలు ఎంత ఆడంబరంగా ఉంటాయో.. అన్నికష్టాలు కూడా ఉంటాయి. డబ్బు,కార్లు,లగ్జరీ లైఫ్ తో పాటు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. కొంత మంది కెరీర్ పీక్స లో ఉండగానే రకరకాల కారణాలు వల్ల మరణించిన వారు కూడా ఉన్నారు. మరి అటువంటి తారలెవరో ఇప్పుడు చూద్దాం.

వెండితెరపై ఆడిపాడి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న తారలు కొందరు తారలు మన మధ్య లేరు. కొన్ని కారణాలవల్ల హఠాత్మరణం పోందారు. తలచుకోవడానికి కాస్త బాధగా ఉన్నా ఇది నిజం. అసలే హీరోయిన్ల కెరీస్ స్పాన్చాలా తక్కువ. అటువంటిది కెరీర్ పీక్స్ లో ఉండగానే.. అతి చిన్న వయస్సులో స్టార్లుగా కొనసాగుతూ..మరణాన్ని చేరిన తారల గురించి చూద్దాం. చిన్న వయసు లోనే ప్రాణాలు విడిచిన ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు..?
హీరోయిన్ గా ఉన్నది రెండేళ్లే అయినా.. స్టార్ హీరోయిన్ హోదాలో వెలిగిపోయింది దివ్య భారతి. బొబ్బిలి రాజా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యభారతి. చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు మోహన్ బాబు లాంటి మరికొంతమంది స్టార్ హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత 19 ఏళ్ల వయసులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో 1993 లో మరణించింది.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్ అంటే వెంటనే సౌందర్య గుర్తుకు వచ్చేది. ఇప్పటికీ మన ఇంటి ఆడపిల్ల అనేలా సౌందర్యను అభిమానిస్తారు ఆమె ఫ్యాన్స్. కన్నడ నుంచి వచ్చినా.. తెలుగు ఇండస్ట్రీలో సౌందర్య అంటే ఒక స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లో కలిపి ఆమె దాదాపు 100కు పైగా సినిమాలు చేసింది. ఇక పెళ్ళి చేసుకుని.. సినిమాలు కంటీన్యూ చేస్తూ ఉన్న టైమ్ లో సౌందర్య 33 ఏళ్ల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది.
ఇక ఆర్తీ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. గ్లామర్ హీరోయిన్ గా.. ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. కుర్ర హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు వరుససినిమాలు చేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి యంగ్ స్టార్స్ తో పాటు.. చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించిన తార.. జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనారోగ్యంతో ఆర్తి అగర్వాల్ 31 ఏళ్ల చిన్న వయసులోనే మరణించింది.
ఇక ఇండస్ట్రీలో వచ్చివారంతా స్టార్లు కాలేరు.. స్టార్ లు అయిన వాళ్లంతా సుఖంగా లేరు.. అప్పుడప్పుడే స్టార్స్ గా మారుతున్నవారు. కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ ప్రత్యూష కూడా ఇలానే మరణించింది. కెరీర్ గాడిన పడుతున్న పరిస్థితుల్లో.. 30 ఏళ్లు దాటకుండానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఆమె మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు అలాగే ఉన్నాయి.
అప్పట్లో కుర్ర కారుకు ఊపునిచ్చిన తార సిల్క్ స్మిత. సిల్క్ స్మిత సినిమా వస్తుంది అంటే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించి తార.. ఎంత సంపాదించిందో.. అంత నష్టాలు చూసింది. మాససికంగా కృగిపోయిన ఈ తార.. 35 ఏళ్ల వయసులోనే మరణించింది. సిల్క్ స్మిత మరణంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి.