లైంగిక దాడి కేసు: పరారీలో జానీ మాస్టర్!
శేఖర్ మాస్టర్ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆయన మీద పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయ్యింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jani Master
ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్.
జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఈ వివాదంపై జానీ మాస్టర్ మాట్లాడారు. మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్.. కుట్రపూరితంగా తనను ఇరికించినట్లు వాపోయాడు.
Jani Master
యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెకు డబ్బులు ఇచ్చి నాపై కేసు పెట్టించారు. గతంలో ఆమె నా దగ్గర పని చేసింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నాన్ మెంబర్స్ పని చేస్తున్నారని నేను ప్రశ్నించినందుకు ఇలా ఇరికించారని జానీ మాస్టర్ అన్నారు.
అయితే జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) చట్టం క్రింద కేసు నమోదు అయ్యింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాసరావు అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించాడు.
Jani Master
జానీ మాస్టర్ పై మహిళా కమీషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి చెందిన నాలుగు బృందాలు జల్లెడ పడుతున్నాయి. మొదట జానీ మాస్టర్ నార్త్ ఇండియాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతడు లడక్ లో ఉన్నాడనేది తాజా సమాచారం.
మరోవైపు జానీ మాస్టర్ బాధితురాలికి అండగా పలువురు టాలీవుడ్ సెలెబ్స్ ముందుకు వస్తున్నారు. అనసూయ భరద్వాజ్ ఆమెను సపోర్ట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఆమె బాధను నేను అర్థం చేసుకోగలను. పుష్ప మూవీ సమయంలో ఆమెను నేను కలిశాను. తన బాధను ఆమె వెల్లడించే స్థితిలో లేదని అనసూయ అన్నారు.
Jani Master
కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఎలా అయితే జస్టిస్ హేమ కమీషన్ వేశారో... టాలీవుడ్ లో మహిళల రక్షణ, వేధింపుల విషయమై కమిటీ ఏర్పాటు చేయాలి సమగ్ర విచారణ జరిపించాలని సమంత సీఎం రేవంత్ రెడ్డి కి నివేదించింది.