ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ.. మన హీరోల మొట్టమొదటి సినిమా ఏంటో తెలుసా?
టాలీవుడ్ హీరో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతున్న విషయం తెలిసిందే. వారి మొట్టమొదటి సినిమా ఎప్పుడు వచ్చింది? ఎవరు డైరెక్ట్ చేశారు? అనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత సీనియర్ ఎన్టీఆర్ (Senior NT Rama Rao) తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అన్నగారు 300 కు పైగా సినిమాల్లో నటించారు. మొట్టమొదట హీరోగా నటించిన చిత్రం ‘మనదేశం‘. 1949లో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ డైరెక్ట్ చేశారు.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు (Akkineni Nageswara Ro) 255 చిత్రాల్లో నటించారు. ఆయన మొట్టమొదటి చిత్రం ‘ధర్మపత్ని’. 1941లో విడుదలైంది. పీ పుల్లయ్య దర్శకత్వం వహించారు.
సాహసాల వీరుడు సూపర్ స్టార్, దివంగత కృష్ణ (Super star Krishna) 350 వరకు సినిమాలు చేశారు. విభిన్న పాత్రలతో అలరించారు. కృష్ణ మొట్టమొదటిగా హీరోగా నటించిన చిత్రం ‘తెనె మనసులు’. 1965లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదూర్తి సుబ్బా రావు దర్శకుడు.
కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇప్పటి వరకు 570 చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మొట్టమొదట హీరోగా నటించిన చిత్రం ‘స్వర్గం నరకం’. లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మోహన్ బాబు ‘భక్తకన్నప్ప’లో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 160కిపై సినిమాలు చేశారు. చిరు మొట్టమొదట హీరోగా నటించిన చిత్రం ‘పునాది రాళ్లు’. కానీ ముందుగా ప్రేక్షకులకు చేరిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ’ చిత్రం 1978లో విడుదలైంది. కే వాసు దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ గ్రీకువీరుడు, కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ప్రారంభించారు. హీరోగా 80కి పైగా సినిమాలు చేశారు. ఆయన మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్’. 1986లో విడుదలైంది. వీ మధుసూదన రావు దర్శకత్వం వహించారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఇప్పటికీ వరుస చిత్రాలతో మాస్ కా బాప్ అనిపిస్తున్నారు. 108 సినిమాలు నటించిన బాలయ్య మొట్టమొదటి చిత్రం ‘తాతమ్మ కల’. తన తండ్రి సీరియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం. 1974లో విడుదలైంది.
రామానాయుడు కొడుకు, విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ప్రస్తుతం యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నారు. వెంకీ ఫస్ట్ హీరోగా చేసిన చిత్రం ‘కలియుగ పాండవులు’. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సినిమాలు, పొలిటికల్ కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ బాబు మొదట హీరోగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. 1996లో విడుదలైంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చైల్డ్ ఆర్టిస్గ్ గా చాలా సినిమాలు చేశారు. హీరోగా మొట్టమొదట నటించిన చిత్రం ‘రాజకుమారుడు’. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. 1999లో ఈ చిత్రం విడుదలైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘సలార్’తో రాబోతున్నారు. ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. ఇక డార్లింగ్ ఫస్ట్ హీరోగా నటించిన చిత్రం ‘ఈశ్వర్’. 2002లో విడుదలైంది. జయంత్ సీ పరంజీ దర్శకత్వం వహించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JrNTR) చేసినవి తక్కువ సినిమాలే అయినా గ్లోబల్ స్టార్ గా గుర్తింపుపొందారు. తారక్ మొట్టమొదట ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం 2001లో విడుదలైంది. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం చేశారు. ప్రస్తుతం ‘దేవర’లో నటిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలుత నటించిన చిత్రం ‘చిరుత’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2007లో విడుదలైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ చరణ్ కంటే ముందే స్టార్ట్ అయ్యింది. హీరోగా మొట్టమొదటి సినిమా గంగోత్రిలో నటించారు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.