మేజర్ సర్జరీ చేయించుకున్న పూజా హెగ్డే..? ఆమె నిర్ణయం వెనుక అసలు కారణం అదే అంటూ!
పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఒక్క మూవీ లేదు. ఆమె కావాలనే చిత్రాలు చేయడం లేదని. ఆమెకు మేజర్ సర్జరీ జరిగిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

పూజా హెగ్డే చివరి చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ మూవీ విడుదలైన నాలుగు నెలలు అవుతున్నా మరో మూవీ ప్రకటించలేదు. సాయి ధరమ్ తేజ్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన లేదు. దానికి తోడు గుంటూరు కారం ప్రాజెక్ట్ వదులుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజా హెగ్డే చేయాల్సింది.
పూజా హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా మేకర్స్ ఆమెకు ఆఫర్స్ ఇవ్వడం లేదనే వాదన ఉంది. అయితే అది నిజం కాదట. పూజా హెగ్డే షూటింగ్స్ కి కావాలనే దూరంగా ఉంటున్నారట. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ఆమె వదులుకోవడం వెనుక అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంటున్నారు.
గతంలో పూజా హెగ్డే కాలికి గాయంతో కనిపించారు. ఆమెను చాలా కాలంగా మడమ నొప్పితో బాధపడుతున్నారట. రాధే శ్యామ్ షూటింగ్ సమయంలోనే ఈ సమస్య మొదలైందట. తాత్కాలికంగా మందులతో సరిపెట్టుకొని వస్తున్న పూజా హెగ్డే కాలి నొప్పి అధికమైందట. డాక్టర్స్ సర్జరీ సూచించారట. వైద్యుల సలహా మేరకు పూజా హెగ్డే సర్జరీ చేయించుకున్నారట. అందుకే ఆమె ఒప్పుకున్న చిత్రాల నుండి తప్పుకోవడంతో పాటు, కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
2022లో ఆమెకు వరుస షాకులు తగిలాయి. ఒకదానికి మించిన మరో డిజాస్టర్ పూజా ఖాతాలో చేరాయి. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ మిగిల్చింది.
Image: PR Handout
రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ ఇచ్చింది.రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది.
విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ చిత్రం సర్కస్ వీటన్నింటినీ మించిన డిజాస్టర్ అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ వరస్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకులు అభివర్ణించారు.
సల్మాన్ ఖాన్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆయన కూడా కాపాడలేకపోయాడు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ప్లాప్ అయ్యింది. దాంతో వరుసగా ఐదు ప్లాప్స్ పూజా హెగ్డే ఖాతాలో పడ్డాయి.