- Home
- Entertainment
- Shalini Pandey : షాలినీ పాండే చేసే వర్కౌట్స్ చేస్తే.. పొట్ట ఐస్ క్రీమ్ లా కరిగిపోవాల్సిందే.!
Shalini Pandey : షాలినీ పాండే చేసే వర్కౌట్స్ చేస్తే.. పొట్ట ఐస్ క్రీమ్ లా కరిగిపోవాల్సిందే.!
టాలీవుడ్ నటి షాలినీ పాండే (Shalini Pandey) లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె వర్కౌట్స్ చూస్తే చాలా మందికి స్ఫూర్తిదాయకంగానే ఉందని చెప్పొచ్చు.

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే సోషల్ మీడియాలో ఎప్పుడూ నెట్టింట దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూనే ఉంటోంది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే సంచలనంగా మారి అందరి చూపు తనపై పడేలా చేసింది.
ఆమె కెరీర్ లో Arjun Reddy సినిమా ఒక్కటే పెద్ద సక్సెస్ అందించింది. ఆ తర్వాత తెలుగులో, బాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ నామమాత్రంగానే నిలిచాయి.
సినిమాల సంగతి అటుంచితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను పంచుకుంది.
తన వర్కౌట్స్ తో అందరినీ ఆకట్టుకుంది. బాడీని స్పింగ్ లా వంచుతూ వర్కౌట్స్ చేస్తూ వచ్చింది. స్క్వాట్స్, పుష్ అప్స్, ఫ్రాగ్ జంపింగ్, ఇతర ప్రత్యేకమైన వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.
షాలినీ పాండే సినిమాల్లో మెరియకున్న ఇలా తన గురించిన వీడియోలు, ముఖ్యంగా ఫిట్ నెస్ మోటీవేషన్ అందిస్తూ పలు పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.