- Home
- Entertainment
- రాశీ ఖన్నా హాట్ పోజులకు కుర్రాళ్ల ఫ్యూజ్ లు అవుట్.. రెడ్ మిర్చి అందాలతో టెంపరేచర్ పెంచుతున్న గ్లామర్ బ్యూటీ..
రాశీ ఖన్నా హాట్ పోజులకు కుర్రాళ్ల ఫ్యూజ్ లు అవుట్.. రెడ్ మిర్చి అందాలతో టెంపరేచర్ పెంచుతున్న గ్లామర్ బ్యూటీ..
హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ట్రెండీ వేర్స్ లో హాట్ పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

ఢిల్లీ భామా రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ మూవీల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
అయితే రాఖీ ఖన్నా నటిస్తున్న చిత్రాలు హిట్టా.. ఫట్టా అనే అంశాన్ని పక్కనేడితే.. ఈ గ్లామర్ బ్యూటీకి సినిమా అవకాశాలు మాత్రం బోలెడన్నీ వస్తున్నాయి. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత నుంచి తన కాల్ షీల్ దొరకడమే కష్టంగా మారింది. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటోంది.
టాలీవుడ్ హీరోయిన్ పేరొందిన రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. ఆమె అడుగులు కూడా బాలీవుడ్ వైపే వేస్తోంది. సినిమాల్లో వచ్చే అవకాశాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ లోనైనా నటించేందుకు వెనకాడటం రాశీ ఖన్నా.
కాగా, తెలుగు ఆడియెన్స్ ను చివరిగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో అలరించింది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమా రాలేదు. తాజాగా హీరో గోపీచంద్ (Gopichand)తో కలిసి నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’తో ఆడియెన్స్ ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
జూలై 1న రిలీజ్ కానున్న Pakka Commercial చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాశీ ఖన్నా రెడ్ బాడీకాన్ డ్రెస్ లో హాజరై అందరి చూపును ఆకర్షించింది. చిత్ర ప్రమోషన్ లో అట్రాక్షన్ గా నిలిచిందీ బ్యూటీ. ఈ అవుట్ ఫిట్ లోనే రాశీ ఫొటోషూట్ కూడా చేసింది.
ఆ పిక్స్ ను అభిమానులతో తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఈ పిక్స్ లో రాశీ ఖన్నా కుర్రాళ్లను రెచ్చగొట్టేలా హాట్ ఫోజులిచ్చింది. బెడ్ పై సిట్టింగ్ పోజిషన్ లో రాశీని చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అప్పటికే ఆమె గ్లామర్ కు ఫిదా అయ్యే నెటిజన్లకు రెడ్ డ్రెస్ లో దర్శనమిచ్చి మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.