MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Hero Crores Lost: చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు నష్టపోయిన టాలీవుడ్‌ హీరో ఎవరో తెలుసా? ఇటీవలే పెద్ద డిజాస్టర్‌

Hero Crores Lost: చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు నష్టపోయిన టాలీవుడ్‌ హీరో ఎవరో తెలుసా? ఇటీవలే పెద్ద డిజాస్టర్‌

Hero Crores Lost: టాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీ చిత్రాలతో మెప్పించిన నటుడు ఇప్పుడు విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన చిన్న పొరపాటుతో ఏకంగా వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాడట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 01 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేల కోట్లు నష్టపోయిన టాలీవుడ్‌ హీరో
Image Credit : Facebook@sivaji

వేల కోట్లు నష్టపోయిన టాలీవుడ్‌ హీరో

సినిమాల్లో ఒక్కసారి రాణిస్తే, క్లిక్‌ అయితే పారితోషికం రూపంలో గట్టిగానే వస్తుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు రెమ్యూనరేషన్స్ రూపంలో వందల కోట్లు సంపాదిస్తుంటారు. అయితే ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన తెలుగు నటుడు తన చిన్న పొరపాటు కారణంగా వేల కోట్లు నష్టపోయాడు. రియల్‌ ఎస్టేట్‌ చేద్దామని ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డాడు. సుమారు రెండు వేల కోట్ల వరకు నష్టపోయాడు. మరి ఆ హీరో ఎవరు? ఎంత నష్టపోయాడనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెకండ్‌ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న శివాజీ
Image Credit : youtube/@youwemedia

సెకండ్‌ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న శివాజీ

ఆ హీరో ఎవరో కాదు శివాజీ. ఇటీవల ఆయన `90 ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` చిత్రంతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత `కోర్ట్` మూవీ ఆయనకు సెకండ్‌ ఇన్నింగ్స్ కి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో మంగపతి పాత్రలో ఇరగదీశాడు. వాహ్‌ అనిపించాడు. ఆ తర్వాత `దండోరా` చిత్రంతో అందరి హృదయాలను కదిలించాడు. కానీ ఇటీవల పెద్ద డిజాస్టర్‌ అందుకున్నారు.

Related Articles

Related image1
Allu Arjun: ఆ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటే అల్లు అర్జున్‌ హార్ట్ బ్రేక్‌.. బన్నీ ఆరాధించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Related image2
Tabu: చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కోల్పోయిన టబు, కొంప ముంచిన స్టార్‌ హీరోయిన్‌.. లేదంటే టాలీవుడ్‌ క్వీన్‌ తనే
35
సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసనితో పరాజయం
Image Credit : Asianet News

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసనితో పరాజయం

శివాజీ మెయిన్‌ లీడ్‌గా ఇటీవల `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` అనే చిత్రం రూపొందింది. దీనికి తనే నిర్మాత. లయ ఆయనకు జోడీగా చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీ ఓటీటీ కోసం రూపొందించారు. కానీ థియేటర్లో విడుదల చేశారు. థియేటర్లో ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ఈ దెబ్బకి ఇంకా ఓటీటీలోకి కూడా రాలేదు. ఇప్పుడు మళ్లీ సెలక్టీవ్‌గా వెళ్తోన్న ఆయన ఇటీవల చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను వేల కోట్లు నష్టపోయిన విషయాన్ని వెల్లడించారు.

45
శివాజీ చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Image Credit : starmaa

శివాజీ చేసిన మిస్టేక్‌ ఏంటంటే?

శివాజీ ఒకప్పుడు హీరోగా రాణించారు. కామెడీ హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. చిరంజీవి, బాలయ్య వంటి టాప్‌ హీరోల తర్వాత కామెడీ చిత్రాలతో టైర్‌ 2 హీరోల్లో ఒకరిగా రాణించారు. కెరీర్‌ బాగున్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్లాడు. అక్కడ సక్సెస్‌ కాలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అయితే సినిమాల్లోకి రాలేని పరిస్థితుల్లో ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పొరపాటు చేశారు. దీంతో వేల కోట్లు కోల్పోయాడు.

55
రెండు వేల కోట్లు నష్టపోయిన శివాజీ
Image Credit : Asianet News

రెండు వేల కోట్లు నష్టపోయిన శివాజీ

హీరోగా పీక్‌లో ఉన్నప్పుడు కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 18ఎకరాలు ల్యాండ్‌ తీసుకున్నాడట శివాజీ. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాన్ని అమ్మేశారు. మరో చోట ఇన్వెస్ట్ చేశాడట. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే కోకాపేటలో ల్యాండ్‌ వ్యాల్యూ పెరిగింది. ఇప్పుడు ఒక్కో ఎకరం వంద కోట్లకుపైగా పలుకుతోంది. కొన్ని కోట్ల 150కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆ మధ్య ప్రభుత్వం ల్యాండ్‌ అమ్మితే వంద కోట్లకుపైగా పలికింది. ఇప్పుడు ఆ రేట్లు ఇంకా పెరిగాయి. దీంతో శివాజీ ఏకంగా రూ.1800కోట్ల నుంచి 2 వేల కోట్లకుపైగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. ఆ మనీ రొటేషన్‌ చేసినా ఇప్పుడు వాటి వ్యాల్యూ పది శాతానికి అటుఇటుగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా శివాజీ చేసిన మిస్టేక్‌ పెద్ద దెబ్బ కొట్టింది. వేల కోట్లకు అధిపతి అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం మళ్లీ నటుడిగా స్ట్రగుల్‌ అవుతున్నాడు శివాజీ. విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. కొత్తగా ఆయన మరే మూవీని ప్రకటించలేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Allu Arjun: ఆ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటే అల్లు అర్జున్‌ హార్ట్ బ్రేక్‌.. బన్నీ ఆరాధించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Tabu: చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కోల్పోయిన టబు, కొంప ముంచిన స్టార్‌ హీరోయిన్‌.. లేదంటే టాలీవుడ్‌ క్వీన్‌ తనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved