`బాఘి 4` బాక్సాఫీసు కలెక్షన్లు.. టైగర్ ష్రాఫ్ 5 సినిమాల రికార్డులు బద్దలవుతాయా?
'బాఘీ 4' విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజున రూ.12 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. టైగర్ ష్రాఫ్ అతిపెద్ద హిట్ చిత్రాల రికార్డును ఈ చిత్రం బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

బాఘీ 3
2020లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'బాఘీ 3' చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మించారు. రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 93.37 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది.
వార్
2019 లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'వార్' లో టైగర్ ష్రాఫ్ తో పాటు హృతిక్ రోషన్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.318.01 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ రూ.170 కోట్లు.
బాఘీ 2
2018 లో విడుదలైన 'బాఘీ 2' చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన దిశా పటానీ నటించింది. రూ.59 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.164.38 కోట్లు వసూలు చేసింది. టైగర్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటి.
బాఘీ
2016లో వచ్చిన టైగర్ ష్రాఫ్ 'బాఘీ' చిత్రానికి దర్శకుడు సబ్బీర్ ఖాన్, నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. నడియాడ్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. రూ.35 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.76.34 కోట్లు వసూలు చేసింది.
హీరోపంటి
2014 లో విడుదలైన 'హీరోపంటి' చిత్రంలో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాజిద్ నడియాడ్వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 52.92 కోట్లు వసూలు చేసింది.
బాఘీ 4
`బాఘీ` చిత్రాల సిరీస్‌లో భాగంగా ఇప్పుడు `బాఘీ 4` మూవీ వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. తొలి రోజు ఈ చిత్రం రూ. 12కోట్లు వసూలు చేసింది. రెండో రోజు పది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనమ్ బజ్వా నటించారు. ఈ మూవీ `వార్` రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.