MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సౌందర్య చివరి కోరిక, అది తీరకుండానే మరణం!

సౌందర్య చివరి కోరిక, అది తీరకుండానే మరణం!

హీరోయిన్ సౌందర్యకు ఒక చివరి కోరిక ఉందట. అది నెరవేరకుండానే ఆమె మరణించారు. అదేమిటో చూద్దాం..

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 04 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.  ఆమె పలు భాషల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందరు స్టార్ హీరోలతో ఆమె జతకట్టారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా వెంకటేష్ తో ఆమె ఎక్కువ చిత్రాలు చేసింది. వీరి కాంబోలో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. రాజా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, దేవి పుత్రుడు, జయం మనదేరా వంటి హిట్ చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి.  అయితే తిరుగులేని స్టార్డం అనుభవించిన సౌందర్య కోరుకున్న జీవితం మాత్రం వేరట.  కన్నడ అమ్మయిన సౌందర్యను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె ఫస్ట్ తెలుగు మూవీ. ఆ మూవీ పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. అనంతరం ఆమెకు వరుస హిట్స్ పడ్డాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Soundarya

Soundarya

ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు చిత్రాల్లో సౌందర్య హీరోయిన్ గా నటించింది. అవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. నెంబర్ వన్, హలో బ్రదర్, మేడమ్ చిత్రాలతో సౌందర్య స్టార్డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. రెండు దశాబ్దాలు సౌందర్య స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. 

సౌందర్య సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. అనూహ్యంగా 2004లో కన్నుమూశారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య తన సోదరుడితో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది. అప్పట్లో ఇది సంచలనమైంది. 

35


అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచింది. వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్యకు అసలు నటి కావడం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమె క్లోజ్ ఫ్రెండ్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

ఆమనికి సౌందర్య చాలా క్లోజ్. ఇద్దరూ కన్నడ వాళ్ళు కావడంతో బాగా కలిసిపోయేవారట. ప్రతి విషయం ఆమనితో సౌందర్య షేర్ చేసుకుందట. ఈ క్రమంలో సౌందర్య గురించి చాలా విషయాలు ఆమనికి తెలుసు. అసలు హీరోయిన్ కావడం సౌందర్యకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న బలవంతం మీద పరిశ్రమకు వచ్చిందని ఆమని అన్నారు. తండ్రి మరణించాక అన్నయ్యను అదే స్థాయిలో ఆమె గౌరవించారని అని ఆమని వెల్లడించారు. 
 

45

తండ్రి ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చాక..  తర్వాత ఇంట్రెస్ట్ కలిగి చేసింది. కానీ ఆమెకు సాధారణ జీవితం ఇష్టం. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహిణిగా ఉండాలని కోరుకునేది. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆమని ఆవేదన చెందారు. 2003 ఏప్రిల్ నెలలో జి రఘు అనే వ్యక్తిని సౌందర్య వివాహం చేసుకుంది. పెళ్ళైన ఏడాది లోపే మరణించింది. ఆమె కోరుకున్న జీవితం అనుభవించక ముందే ఆమె కన్నుమూశారు. 
 

55

సుదీర్ఘ కాలం పరిశ్రమలో ఉన్న సౌందర్య అనేక హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె చేసిం రాజా, అమ్మోరు, అన్నయ్య వంటి చిత్రాలు భారీ విజయం సాధించాయి. 2000లో విడుదలైన అన్నయ్య చిత్రం భారీ హిట్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Recommended image2
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved