- Home
- Entertainment
- శృతి హాసన్ కు ఈ వీకెండ్ చాలా స్పెషల్ అంట.. గ్లామర్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
శృతి హాసన్ కు ఈ వీకెండ్ చాలా స్పెషల్ అంట.. గ్లామర్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఈ వీకెండ్ చాలా స్పెషల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకుందంట. దీంతో పట్టలేనంత ఆనందంలో మునిగితేలుతోంది. ఈ సందర్భంగా పలు పిక్స్ ను షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ నోట్ రాసింది.

గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ కెరీర్ లో దూసుకెళ్లోంది. ఏకంగా టాలీవుడ్ బడా స్టార్స్ తో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఊహించని విధంగా అప్ కమింగ్ ఫిల్మ్స్ ను ప్రకటిస్తూ ఫుల్ బిజీ అవుతోందీ బ్యూటీ. ప్రతి చిత్రంలో ఏదోక స్పెషల్ టాలెంట్ ను బయటపెడుతూ అభిమానులను ఫిదా చేస్తోంది.
చివరిగా మాస్ మహారాజా రవితేజ (RaviTeja) సరసన‘క్రాక్’ సినిమాలో నటించింది. అందాలు ఆరబోయడమే కాకుండా మాస్ మాహారాజ సరసన మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. మరో వైపు ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ప్రస్తుతం శృతి హాసన్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ ను కూడా శృతి కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. తొలిసారి శృతి హాసన్ ప్రభాస్ తో కలిసి.. అదీ పాన్ ఇండియన్ మూవీలో నటిస్తుండటం విశేషం.
అలాగే మెగా స్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక నందమూరి నటసింహం బాలయ్య తదుపరి చిత్రం ఎన్బీకే107 (NBK107)లోనూ ఆడిపాడనుంది. ఇలా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ.
అయితే శృతి హాసన్ గతేడాది తన బాయ్ ప్రెండ్ శంతను హజారిక (Shantanu Hazarika)ను పరిచయం చేసిన విషయం తెలిసందే. వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ సమయం ఉన్నప్పుడు ప్రియుడితో సమయం గడుపుతోంది. అయితే ఈ వీకెండ్ ఎక్స్ కర్షన్ కు వెళ్లిన శృతి అక్కడి ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ నోట్ రాసింది.
‘నేను ఒక అందమైన రోజును గడిపాను.. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. మనస్సు ఆశతో నిండి పోయింది. నేను ఇలా మారినందుకు మరియు నా చుట్టూనే ఉన్న శంతను హజారికకు కృతజ్ఞతలు’ అంటూ నోట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా తను పోస్ట్ చేసిన పిక్స్ లోనూ శృతి చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అట్రాక్టివ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.