MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. అందరి చూపు ఆ మూవీపైనే

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. అందరి చూపు ఆ మూవీపైనే

This Week OTT :  ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ నటించిన మూవీపైనే అందరి చూపు ఉండటం విశేషం.    

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 20 2025, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు
Image Credit : Asianet News

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

ఈ వారం(అక్టోబర్‌ 20-25) ఓటీటీలో రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీపావళి పండుగని పురస్కరించుకుని చాలా సినిమాలు, సిరీస్‌లు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. అయితే ఈ సారి వెబ్‌ సిరీస్‌ల హడావుడి కంటే ఓటీటీ సినిమాల హంగామా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్‌ కళ్యాణ్‌ మూవీపై అందరి చూపు ఉంది. ఇప్పటికే థియేటర్లలో దుమ్ములేపిన పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` ఇప్పుడు ఓటీటీ రచ్చ చేసేందుకు వస్తోంది. దీంతోపాటు ఇంకా ఏ ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ నెల 23న నెట్‌ ఫ్లిక్స్ లో పవన్‌ `ఓజీ`
Image Credit : Asianet News

ఈ నెల 23న నెట్‌ ఫ్లిక్స్ లో పవన్‌ `ఓజీ`

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, తెలుగు ఆడియెన్స్‌ మొత్తం వెయిట్‌ చేస్తున్నది `ఓజీ` మూవీ కోసం. పవర్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండగ స్పెషల్‌గా ఈ నెల 23న విడుదల కాబోతుంది. ఇది నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ నటించింది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటు ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్‌, వెంకట్‌, హరీష్‌ ఉత్తమన్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 25న థియేటర్లలో విడుదలైంది. బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సుమారు రూ.320కోట్లు వసూలు చేసినట్టు టాక్. ఈ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రంగా `ఓజీ` నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. పవన్‌ ఫ్యాన్స్ కి మరోసారి ట్రీట్‌ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.

37
అక్టోబర్‌ 24న జీయో హాట్‌ స్టార్‌లో విజయ్‌ ఆంటోని `భద్రకాళి`
Image Credit : X/vijay antony film corporation

అక్టోబర్‌ 24న జీయో హాట్‌ స్టార్‌లో విజయ్‌ ఆంటోని `భద్రకాళి`

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన `భద్రకాళి` మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం జీయో హాట్‌స్టార్‌ లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. `బిచ్చగాడు`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన విజయ్‌ ఆంటోని రీసెంట్‌గా `భద్రకాళి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆకట్టుకోలేకపోయింది. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ కాలేదు. మరి ఓటీటీలో అయినా అలరిస్తుందా అనేది చూడాలి.

47
జాన్వీ కపూర్‌ `పరమ్‌ సుందరి` ఈ నెల 24న స్ట్రీమింగ్‌
Image Credit : x/janhvi kapoor

జాన్వీ కపూర్‌ `పరమ్‌ సుందరి` ఈ నెల 24న స్ట్రీమింగ్‌

`దేవర` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. ఇటీవల ఆమె హిందీలో `పరమ్‌ సుందరి` అనే చిత్రంలో నటించింది. సిద్దార్థ్‌ మల్హోత్రా హీరో. తుషార్‌ జలోటా దర్శకత్వం వహించారు. ఏఐ కథతో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో యావరేజ్‌గా ఆడింది. కేరళాలో వివాదానికి కారణమైంది. ఆగస్ట్ 29న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మలయాళంలో గతేడాది విడుదలైన `నడికర్‌` మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. లాల్‌ జూనియర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టొవినో థామస్‌, దివ్య పిళ్లై, బాలు వర్గేసే, సురేష్‌ కృష్ణ, సౌబిన్‌ షాహిర్‌, షైన్‌ టామ్‌ చాకో, అనూప్‌ మీనన్‌ వంటి వారు నటించారు. ఈ చిత్రం అక్కడ డిజాస్టర్‌ అయ్యింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు లయన్స్ గేట్‌ ప్లేలో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

57
ఫస్ట్ టైమ్‌ ఫ్యాషన్‌ బిజినెస్‌ రియాలిటీ షో
Image Credit : jio hotstar

ఫస్ట్ టైమ్‌ ఫ్యాషన్‌ బిజినెస్‌ రియాలిటీ షో

వీటితోపాటు సోమవారం(అక్టోబర్‌ 20)న `పిచ్చ్‌ టూ గెట్‌ రిచ్‌` అనే హిందీ రియాలిటీ షో స్టార్ట్ అవుతోంది. జీయో హాట్‌ స్టార్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫ్యాషన్‌ రంగానికి సంబంధించిన బిజినెస్‌ రియాలిటీ షో ఇది. కరణ్‌ జోహార్‌తోపాటు అక్షయ్‌ కుమార్‌, మలైకా అరోరా, మనీష్‌ మల్హత్రా భాగమయ్యారు. ఇండియాలోనే మొదటిసారిగా ఒక ఫ్యాషన్‌ బిజినెస్‌పై ఒక షోని స్టార్ట్ చేయడం విశేషం. సోమవారమే మలయాళ ఫిల్మ్ `చుట్టులి` స్ట్రీమింగ్ అవుతుంది. రాజ్‌ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో షైన్‌ టామ్‌ చాకో హీరోగా నటించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు మనోరమ మాక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

67
నెట్‌ ఫ్లిక్స్ లో యానిమేషన్‌ `కురుక్షేత్రః పార్ట్ 2`
Image Credit : netflix

నెట్‌ ఫ్లిక్స్ లో యానిమేషన్‌ `కురుక్షేత్రః పార్ట్ 2`

మరోవైపు వెబ్‌ సిరీస్‌ల విషయానికి వస్తే మహాభారతం ప్రధానంగా రూపొందిన యానిమేషన్‌ సిరీస్‌ `కురుక్షేత్రః పార్ట్ 2` ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది నెట్‌ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. 

77
ఫస్ట్ ఏఐ వెబ్‌ సిరీస్‌ `మహాభారత్‌ః ఏక్‌ ధర్మయుధ్‌`
Image Credit : jio hotstar

ఫస్ట్ ఏఐ వెబ్‌ సిరీస్‌ `మహాభారత్‌ః ఏక్‌ ధర్మయుధ్‌`

దీంతోపాటు 25న మహాభారతం కథతోనే ఇండియాలోనే మొదటిసారి పూర్తి ఏఐ టెక్నాలజీతో `మహాభారత్‌ః ఏక్‌ ధర్మయుధ్‌` పేరుతో సిరీస్‌ని రూపొందించారు. ఇది అక్టోబర్‌ 25న జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. పూర్తి ఏఐతో రూపొందించిన ఈ సిరీస్‌పై అందరిలోని ఆసక్తి నెలకొంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
చిరంజీవి వచ్చినా జబర్దస్త్ ని లేపలేరు.. షో పడిపోవడానికి కారణం ఇదే, కమెడియన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
ఊహించని విధంగా భరణి ఎలిమినేటెడ్, ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర వృధా.. భరించలేక వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ, దివ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved