- Home
- Entertainment
- సంక్రాంతి పోరులో 'హను మాన్' విజేత.. గుంటూరు కారంతో సహా మూడు సినిమాలు వెనుకబడటానికి కారణాలు ఇవే
సంక్రాంతి పోరులో 'హను మాన్' విజేత.. గుంటూరు కారంతో సహా మూడు సినిమాలు వెనుకబడటానికి కారణాలు ఇవే
టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి ఆసక్తికరమైన పోటీ ఉంటుంది. సంక్రాంతి అంటే టాలీవుడ్ లో సినిమా పండగే అని చెప్పాలి. కనీసం మూడు నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అందుకే ప్రతిసారి థియేటర్ల సద్దుబాటు విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి.

టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి ఆసక్తికరమైన పోటీ ఉంటుంది. సంక్రాంతి అంటే టాలీవుడ్ లో సినిమా పండగే అని చెప్పాలి. కనీసం మూడు నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అందుకే ప్రతిసారి థియేటర్ల సద్దుబాటు విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా అలాంటి రచ్చే జరిగింది.
సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, అలాగే చిన్న చిత్రంగా హను మాన్ రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి హడావిడి ముగిసింది. నాలుగు చిత్రాల్లో విజేత ఎవరో తేలిపోయింది. కొద్దిపాటి అంచనాలతో.. గుంటూరు కారం లాంటి భారీ చిత్రం హోరులో బలైపోతుందనే కామెంట్స్ తో విడుదలైన హను మాన్ సంక్రాంతి విజేతగా నిలిచాడు. హను మాన్ పాన్ ఇండియా రేంజ్ లో మోత మోగిస్తోంది. హను మాన్ సక్సెస్ కి కారణాలు ఏంటి ? మిగిలిన చిత్రాలు వెనుకబడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హను మాన్ : తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గుంటూరు కారంతో పాటు అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆంజనేయ స్వామి శక్తిని, విఎఫెక్స్ ని, మైథలాజిని చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నారు. సినిమాకి అవసరమైన ప్రతి చోటా గూస్ బంప్స్ మూమెంట్స్ అందించాడు. ఇక చివరి అర్థ గంట అయితే మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. నార్త్ ఆడియన్స్ కి నచ్చే విధంగా అంజనేయ స్వామి శక్తిని ఈ చిత్రంలో చూపించారు. ఫలితంగా హను మాన్ మూవీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. రోజు రోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకుపోతోంది.
గుంటూరు కారం : సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఆశించిన స్థాయిలో ఘాటు చూపించలేకపోయింది. సినిమాపై మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చిన మాట వాస్తవమే. సినిమా మరీ అంత దారుణంగా అయితే లేదు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే త్రివిక్రమ్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. అంతా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, చిన్న పాటి సెంటిమెంట్ మాత్రమే కనిపించాయి. దీనికి తోడు థియేటర్ల వివాదంలో గుంటూరు కారం చిత్రం ట్రోలింగ్ కి గురైంది. ఆ విధంగా కొద్దిపాటి నెగిటివ్ టాక్ ఎక్కువైపోవడంతో మహేష్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పేలలేదు.
సైంధవ్: విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రం అభిమానులకు తీపి జ్ఞాపకంలాగా మిగిలిపోయివాలని భావించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో తెరెకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఊహించని బూమరాంగ్ అయింది. ఇది సంక్రాంతికి రావలసిన చిత్రం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శైలేష్, వెంకీ ఇద్దరూ చాలా బాగా కష్టపడ్డారు. కానీ ఏది పర్ఫెక్ట్ గా సింక్ కాలేదు. వెంకీ తనకు బలమైన కామెడీ, సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఇలా యాక్షన్ థ్రిల్లర్ తో రావడం తప్పు జరిగింది అని అంటున్నారు.
నా సామిరంగ: కింగ్ నాగార్జున నా సామిరంగ చిత్రాన్ని మంచి ప్లానింగ్ తోనే సంక్రాంతికి రిలీజ్ చేశారు. సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్ అన్ని కలగలిపి పండగ వైబ్స్ ఉండేలా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ ఆశించినంత బలంగా లేదు. ఈ తరహా చిత్రం సంక్రాంతికి ఆడేస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేసినట్లు ఉంది. హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఈ పెద్ద ప్లస్ గా నిలిచింది. అయితే సెంటిమెంట్ పూర్తిగా వర్కౌట్ కాలేదు. ఫలితంగా నాగ్ మూవీ కూడా వెనుకబడింది.