MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేల కోట్లకు వారసులైన చరణ్-ఉపాసన లవర్స్ గా ఉన్నప్పుడు ఎలాంటి బహుమతులు ఇచ్చుకునేవారో తెలుసా? నమ్మలేరు!

వేల కోట్లకు వారసులైన చరణ్-ఉపాసన లవర్స్ గా ఉన్నప్పుడు ఎలాంటి బహుమతులు ఇచ్చుకునేవారో తెలుసా? నమ్మలేరు!

రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లవ్లీ కపుల్. గత ఏడాది పేరెంట్స్ కూడా అయ్యారు. వీరిద్దరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన కుటుంబాల వారసులు. అలాంటి రిచ్ కిడ్స్ ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎంతటి విలువైన గిఫ్ట్స్ ఇచ్చుకున్నారో తెలుసా... మీరు ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 11 2024, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Upasana and Ram Charan

Upasana and Ram Charan


మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. తండ్రి లెగసీనీ ముందుకు తీసుకెళుతున్నాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. 


 

27

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తనదైన రంగంలో దూసుకుపోతున్నారు. ఉపాసన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్. అపోలో గ్రూప్ చైర్పెర్సన్ గా ఉన్నారు. అలాగే మరికొన్నిరంగాల్లో రాణిస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి పీటలు ఎక్కారు. 

37

వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా రామ్ చరణ్ దంపతులు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మెగా కోడలు ఉపాసన అవమానాలు, అపోహలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్లి జరిగినప్పుడే ఉపాసన-రామ్ చరణ్ మధ్య ఒప్పందం కుదిరిందట. పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నారట. 


 

47

అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కార అని పెట్టారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు తీసుకున్నారు. క్లిన్ కార మొదటి ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏట అడుగుపెట్టింది. క్లిన్ కార జన్మదినం సందర్భంగా... అపోలో ఆసుపత్రిలో క్లిన్ కార జననానికి ముందు కుటుంబ సభ్యుల్లో నెలకొన్న భావోద్వేగాలకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. 

57


ఇదిలా ఉంటే రామ్ చరణ్-ఉపాసన ప్రేమికులుగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ డేస్ లో ఉపాసన-రామ్ చరణ్ లకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. మిత్రులుగా వీరి మధ్య గొడవలు కూడా చోటు చేసుకునేవట. 

 

67

ఏళ్ళు గడిచే కొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారింది. రామ్ చరణ్, ఉపాసన ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునేవారట. వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వారసులు కాబట్టి ఉపాసన, రామ్ చరణ్ ఖరీదైన బహుమతులు ఇచ్చుకునేవారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చాలా చీప్ గిఫ్ట్స్ ఇచ్చుకునేవారట. 

77

కాఫీ మగ్, స్లిప్పర్స్, టెడ్డీ బేర్.. ఇలాంటి బహుమతులు ఒకరికి మరొకరు ఇచ్చేవారట. బహుమతి అనేది ఒక జ్ఞాపకం. దానికి మనీ వాల్యూతో సంబంధం లేదని ఇద్దరూ నమ్మేవారట. ఈ విషయం తెలిశాక మన మైండ్ సెట్ మారిపోవాల్సిందే. అంత గొప్పవారు కూడా చాలా చిన్న బహుమతులకు సంతృప్తి చెందారు. అదన్నమాట సంగతి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved