మేమిద్దరం ఒక గదిలో ఉంటే..... నాగచైతన్యతో బంధంపై సమంత తీవ్ర వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - నాగచైతన్య గతేడాది డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్టార్ కపుల్ ఎందుకు విడిపోయారన్నది తెలియదు. తొలిసారిగా విడాకులపై సమంత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

స్టార్ హీరోయిన్ సమంత - నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో చైతూతో కలిసి నటించింది సమంత. అప్పటి నుంచి వీరిద్ద మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. దీంతో 2017లో సమంత అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టింది.
పెళ్లి తర్వాత కూడా సమంత కేరీర్ ను కొనసాగించిన విషయం తెలిసిందే. అటు చైతూతోనే మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేసింది. నాలుగేండ్ల పాటు టాలీవుడ్ లవ్లీ స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ జంటను చూసి సినీ ప్రముఖులు ఎంతగానో సంతోషించారు. కానీ ఇంతలోనే తమ అభిమానులకు, సినీ లోకానికి షాకిచ్చే న్యూస్ ను రివీల్ చేశారు.
2021 అక్టోబర్ 2న వారు విడిపోతున్నట్టు, అలాగే విడాకులు తీసుకుంటున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీలోని పలువురు షాక్ కి గురయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇటు సమంతగానీ, అటు చైతూ గానీ వారి విడాకులపై స్పందించలేదు. పలు కారణాలతో విడిపోయారంటూ రూమర్లు మాత్రం తెగ పుట్టుకొచ్చాయి.
కానీ సమంత తొలిసారిగా తమ విడాకులపై స్పందించింది. డివోర్స్ కు అసలు కారణాన్ని బయటపెట్టింది. హిందీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ‘కాఫీ విత్ కరణ్’ (Coffee with Karan) సీజన్ 7కు గెస్ట్ గా హాజరైంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ.. ‘మీ భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది’ అంటూ సమంతను ప్రశ్నించాడు. ఇందుకు ఆమె వెంటనే స్పందిస్తూ.. ‘భర్త కాదు.. మాజీ భర్త అనండి’ అని సరిదిద్దింది. ఇక తన జీవితాన్ని అభిమానులతోనే పంచుకోవాలనుకున్నానని తెలిపింది.
సోషల్ మీడియాలోనూ తనపై వ్యతిరేకత వచ్చినప్పుడూ తను నిజంగా ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ఈ విషయంలో పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నాని తెలిపింది. విడిపోయినప్పుడు నేను చాలా కలత చెందాను. ప్రస్తుతం జీవితం బాగానే ఉందని వెల్లడించింది.
అయినా కరణ్ జోహార్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ‘మీ మధ్య ఏదైనా కఠినమైన భావాలు ఉన్నాయా?’ అని అడిగే ప్రయత్నం చేశాడు. దీంతో సమంత షాకింగ్ గా రిప్లై ఇచ్చింది. ‘మీమిద్దరం ఒక గదిలో ఉంటే.. మీరు పదునైన వస్తువులను దాచి ఉంచాల్సి వస్తుంది.. నాగచైతన్యతో ప్రస్తుత పరిస్థితి సామరస్యంగా లేదు.. భవిష్యత్ లో అయ్యి ఉండొచ్చు’ అని తెలిపింది.