నాని 'వి' లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్డ్...?
మరో నాలుగు రోజులలో నాని లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించి ఈ చిత్ర హక్కులు దక్కించుకోగా సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. కాగా వి మూవీలో అదిరిపోయే ట్విస్ట్ అంటూ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.
నాని లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి. నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 2నుండి అందుబాటులోకి రానుంది. థియేటర్స్ బంధ్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నారు. దాదాపు 35కోట్ల వరకు చెల్లించి ఈ చిత్రాన్ని ప్రైమ్ దక్కించుకుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఒకటిన్నర నిమిషం సాగిన యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అబ్బురపరిచింది. హీరో నాని సీరియల్ కిల్లర్ గా కేక పుట్టించాడు. ఆయన పాత్రలో సైకో లక్షణాలు కూడా కనిపించడం విశేషం. ఓ భిన్నమైన పాత్రలో నాని రెచ్చిపోయి నటించారనిపిస్తుంది.
మరో హీరో సుధీర్ కథలో కీలకమైన పోలీస్ పాత్ర చేస్తున్నారు. వరుసగా హత్యలు చేస్తున్న ఇంటెలిజెంట్ అండ్ సైకో కిల్లర్ ని వెంటాడే పోలీసుగా అయన పాత్ర ఉండనుంది. బలమైన ప్రత్యర్థికి పోటీ ఇచ్చే పోలీసు పాత్ర సుధీర్ అధ్బుతంగా చేస్తాడు అనిపిస్తుంది. షర్ట్ లెస్ బాడీలో ఆయన యాక్షన్ స్టంట్స్ మెప్పిస్తున్నాయి.
మరో నాలుగు రోజులలో వి ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కాగా ఈ మూవీ కథపై టాలీవుడ్ లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అలాగే మూవీలోని అసలు ట్విస్ట్ ఇదే నంటూ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అత్యంతం ఉత్కంఠగా సాగే వి మూవీలో నాని రోల్ చివరి వరకు నెగెటివ్ గానే సాగుతుందట. సుధీర్ పాత్రే సినిమాకు హీరో అన్నట్లు ఉంటుందట.
సినిమా క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు ఓ ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశారట. అప్పటి వరకు విలన్ గా కనిపించిన నాని పాత్ర హీరోగా, హీరోగా ప్రొజెక్ట్ అయిన సుధీర్ పాత్ర విలన్ గా టర్న్ అవుతాయట. వి మూవీలో అసలు విలన్ సుధీర్ అనేది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో మరో నాలుగు రోజులలో తెలిసిపోనుంది.
నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీజీఎమ్ థమన్ అందించారు. సాంగ్స్ అమిత్ త్రివేది స్వరపరచడం జరిగింది.