MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Box office: ఈ వారం రిలీజ్ లు..ఏది హిట్..ఏది ఫట్? షాకింగ్ రిజల్ట్

Box office: ఈ వారం రిలీజ్ లు..ఏది హిట్..ఏది ఫట్? షాకింగ్ రిజల్ట్

 మొత్తం రెండు రోజుల్లో 9 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.  అసలే ఓటిటి కాలంలో జనం థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప టికెట్లు కొనేందుకు సిద్ధపడటం లేదు. 

2 Min read
Surya Prakash
Published : Jun 25 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Boxoffice

Boxoffice


గత కొద్ది కాలంగా భాక్సాఫీస్ బాగా డల్ గా ఉంది. కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ లు తర్వాత ఆ స్దాయి సినిమా  భాక్సీఫీస్ దగ్గర కపడటం లేదు. గత వారం అదే పరిస్దితి. ఈ వారం కూడా సేమ్ సిట్యువేషన్.       వచ్చే వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వార్ చిన్న చిత్రాల మధ్య ఉంది. సమ్మతమే తో మొదలెట్టి సదా నన్ను నడిపే సినిమాలు బరిలోకి దూకాయి. మొత్తం రెండు రోజుల్లో 9 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.  అసలే ఓటిటి కాలంలో జనం థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప టికెట్లు కొనేందుకు సిద్ధపడటం లేదు. 

28
Konda review

Konda review


అందులో మొదటిది 23న వచ్చిన  రామ్ గోపాల్ వర్మ కొండా. వరంగల్ నేత కొండా మురళి బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ మీద పెద్ద ఎక్సపెక్టేషన్స్  ఏమీ లేవు కానీ వంగవీటి తరహాలో ఏదైనా మినిమమ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

38
sammathame movie review,

sammathame movie review,

 
ఇక తర్వాత 24న రిలీజైన వాటిలో మొదటిది కిరణ్ అబ్బవరం సమ్మతమే. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ స్టోరీ మీద యూత్ లో  ఓ మాదరి ఇంట్రస్ట్ ఉంది. టీజర్, పాటలు జనాల్లోకి  బాగానే వెళ్లాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ హిట్ తర్వాత సెబాస్టియన్ డిజాస్టర్ చూసిన కిరణ్ కు ఈ సక్సెస్ చాలా కీలకంగా మారింది. అయితే ఈ సినిమా కూడా అంతంత మాత్రమే అని తేలిపోయింది.

48
Chor Bazaar

Chor Bazaar


ఇక ఎవరూ ఊహించని విధంగా  రేస్ లోకి వచ్చిన ఆకాష్ పూరి చోర్ బజార్ నిన్నటి రోజున థియేటర్లలో అడుగు పెట్టింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.   డైమండ్ దొంగతనం నేపధ్యంగా తీసుకుని దర్శకుడు జీవన్ రెడ్డి దీన్ని రూపొందించారు. తండ్రి ఎంత పెద్ద డైరెక్టరైనా హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్న ఆకాష్ పూరికి ఇది హిట్ కావడం కీలకం.  అయితే ఈ సినిమాకు జనం ఎవరూ కనపడలేదు. సినిమా అంతంత మాత్రమే అని తేలిపోయింది.

58
Gangster gangaraju review

Gangster gangaraju review


గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే మరో మూవీ కూడా 24నే దిగింది. ప్రమోషన్లు చేసారు కానీ ఇది వస్తున్నట్టు జనానికి పెద్దగా తెలియలేదు.  ఈ సినిమాకు కూడా ఓ మాదిరి ఓపినింగ్స్ రాలేదు. దాంతో భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా అంతంత మాత్రమే అని తేలిపోయింది. 

68
7 days 6 Nights Review

7 days 6 Nights Review


ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించి దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ సైతం పోటీకి దిగింది. ఈ సినిమా కంటెంట్ బాగా డల్ గా ఉందని, సినిమా లో ఏమి చెప్దమని తీసారో క్లారిటీ లేదని అంటున్నారు. సినిమాకు ఓపినింగ్స్ సైతం రాలేదు. ఈ సినిమా వల్ల ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ కు ఏ విధమైన ఫలితం లేకుండా పోయింది.

78
Vikram Box Office - Kamal Haasan's highest grossing film in the first week

Vikram Box Office - Kamal Haasan's highest grossing film in the first week


 ఇప్పటికే అడవి శేషు మేజర్ నెమ్మదించగా విక్రమ్ స్టడీగా ఉంది. ఈ సినిమా కమల్ కెరీర్ లో మరో మైలు రాయిగా మిగిలింది. యాక్షన్ తో ఈ సినిమా జనాలను  బాగానే ఆకట్టుకుంది. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో హాట్రిక్ కొట్టారు. ఈ సినిమాలో చేసిన విజయ్ సేతుపతి, సూర్య కు కూడా ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. 

88


 ఇక అంతకు ముందు వారం రిలీజైన నాని అంటే సుందరానికి ఈదటం కష్టమే అనిపిస్తోంది. అలాగే క్రితం వారం రిలీజైన విరాట పర్వం, గాడ్సే లకు అసలు కలెక్షన్స్ లేవు. ఇవి మాస్, యూత్ ని ఏ మాత్రం  ఆకట్టుకోలేకపోయాయి.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved