MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • చిరంజీవి విలన్ ఆయన కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడా... అంత తోపు యాక్టర్ ఎవరంటే?

చిరంజీవి విలన్ ఆయన కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడా... అంత తోపు యాక్టర్ ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఏళ్ల తరబడి ఉన్నారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన చిత్రంలో ఓ నటుడు ఆయన కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కాగా, ఆ నటుడు ఎవరో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 29 2024, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi

80లలో హీరోగా ఎదిగిన చిరంజీవి స్టార్ డమ్ 90ల నాటికి ఫీక్స్ కి చేరింది. ఆయన వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డులకు ఎక్కాడు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ స్టార్స్ గా ఎదిగే వరకు చిరంజీవి అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొట్టమొదటి తెలుగు హీరో చిరంజీవి. 

37

గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 1.25 కోట్లు అట. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా 1992లో ప్రచురించింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఆ మ్యాగజైన్ లో రాసుకొచ్చారు. అలాంటిది... చిరంజీవి సినిమాలో నటించిన ఓ నటుడు ఆయన కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. 

47
Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది జగదేకవీరుడు అతిలోక సుందరి. చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం రూ. 15 కోట్ల గ్రాస్ రాబట్టింది. 1990లో ఈ మూవీ విడుదలైంది. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీలో అమ్రీష్ పురి విలన్ రోల్ చేశాడు. 

 

57
Chiranjeevi

Chiranjeevi

అమ్రీష్ పురి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి గాను భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. అది చిరంజీవి రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అట. బాలీవుడ్ లో అత్యంత బిజీ యాక్టర్ గా ఉన్న అమ్రీష్ పురి దాదాపు రూ. 70 లక్షలు తీసుకున్నారట. అదే సమయంలో చిరంజీవికి రూ. 50 లక్షలు ఇచ్చారట. 
 

67
Chiranjeevi

Chiranjeevi

1990 మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కాసుల వర్షం కురిపించింది. 1992లో చిరంజీవికి గ్యాంగ్ లీడర్ రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ పడింది. దాంతో చిరంజీవి రెమ్యూనరేషన్ కోటి దాటిపోయింది. 

 

77

ప్రస్తుతం మాట్లాడుకుంటే... తన జనరేషన్ స్టార్స్ లో చిరంజీవి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రెండు వందల కోట్ల వసూళ్లు సాధించిన సీనియర్ హీరో. ఇది బాలయ్య, నాగార్జున, వెంకీలకు సాధ్యం కానీ ఫీట్ అని చెప్పొచ్చు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved