- Home
- Entertainment
- Puspha: మహేష్, విజయ్ సేతుపతి, దిశా పటాని... పుష్ప సినిమా కోల్పోయిన స్టార్స్ ఎవరంటే!
Puspha: మహేష్, విజయ్ సేతుపతి, దిశా పటాని... పుష్ప సినిమా కోల్పోయిన స్టార్స్ ఎవరంటే!
ప్రతి గింజ మీద తిండేవాడి పేరుంటుందంటారు. అలాగే దర్శకుడు రాసుకునే ప్రతి స్క్రిప్ట్ పై ఓ హీరో పేరు రాసుంటుంది. సదరు దర్శకుడు పలానా హీరో అనుకోని రాసుకున్న కథ మరో హీరో చేయవచ్చు.

ఓ భారీ హిట్ సినిమాను ఒక హీరో, హీరోయిన్ రిజెక్ట్ చేశారని తెలిస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. అరే చేజేతులా ఓ మంచి సినిమాను వదులుకున్నారన్న భావన కలుగుతుంది. సుకుమార్-అల్లు అర్జున్ కంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) బంపర్ హిట్ కొట్టింది. అయితే ఈ మూవీలో నటించిన అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక, ఫహద్ ఫాజిల్, సమంత స్థానంలో వేరొకరు నటించాల్సింది. అయితే వారు రిజెక్ట్ చేయడం జరిగింది. పుష్ప మూవీని వదులుకున్న స్టార్స్ ఎవరో చూద్దాం...
పుష్ప సబ్జెక్ట్ దర్శకుడు సుకుమార్ మొదట మహేష్ బాబు (Mahesh babu) కు వినిపించారు. సుకుమార్ చెప్పిన కథ నచ్చినప్పటికీ హీరోది నెగిటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామర్ రోల్ కావడంతో... తనకు సెట్ కాదని మహేష్ సున్నితంగా తిరస్కరించాడు. మహేష్ రిజెక్ట్ చేయడంతో ఈ సబ్జెక్ట్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది.
samantha
పుష్ప హీరోయిన్ శ్రీవల్లి పాత్ర కోసం సుకుమార్ ఫస్ట్ సమంత(Samantha)ను అనుకున్నారు. రంగస్థలం మూవీలో రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయిన సమంత శ్రీవల్లి పాత్రకు రైట్ ఆప్షన్ అనుకున్నాడు. అసలు సమంతను దృష్టిలో ఉంచుకొని శ్రీవల్లి పాత్ర డెవలప్ చేశా రు.
samantha
అయితే సమంత సుకుమార్ కి నిరాశ మిగిల్చింది. సమంత చేయనని చెప్పడంతో సుకుమార్ వేరే హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న రష్మిక మందానను సంప్రదించగా ఆమె ఓకే చేశారు. దీంతో ఆమెకు పుష్ప రూపంలో మరో భారీ హిట్ దక్కింది.
అలాగే పుష్ప మూవీలో ప్రధాన విలన్ భన్వర్ లాల్ షెకావత్ పాత్ర కోసం సుకుమార్ చాలా మందిని సంప్రదించారు. ఆయన ఫస్ట్ ఆప్షన్ గా విజయ్ సేతుపతి ఉన్నారు. పుష్ప లో ఆయన పాత్ర నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో విజయ్ సేతుపతి చేయను అన్నారు. తర్వాత హీరో నారా రోహిత్ వద్దకు ఈ ఆఫర్ వెళ్ళింది. అలాగే బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తాను కూడా సంప్రదించారు. వారందరూ వివిధ కారణాలతో షెకావత్ రోల్ చేయననడంతో ఫహాద్ ఫాజిల్ వద్దకు వెళ్ళింది.
ఇక సమంత చేసిన ఐటెం సాంగ్.. ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ యూత్ ని ఊపేస్తుంది. సూపర్ హిట్ కొట్టిన ఈ ఐటెం సాంగ్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని చేయాల్సింది. ఆమె అంగీకరించకపోవడంతో సమంత చేశారు.
ఇక పుష్ప ఫ్రెండ్ కేశవ రోల్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. హీరోకి సమానమైన స్క్రీన్ స్పేస్ కలిగిన కేశవ పాత్ర జగదీష్ ప్రతాప్ బండారికి దక్కింది. ఫేమ్ నటుడు మహేష్ విట్టా కూడా ఆడిషన్ కి వెళ్లారట. అతడు తృటిలో ఈ ఛాన్స్ కోల్పోయారట.