MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్లకు కోట్లల్లో లాభాలు కురిపిస్తున్న ఓయో హోటల్స్, మహేష్ హీరోయిన్ కూడా.. ఎవరెవరు ఎంత మొత్తం అంటే

హీరోయిన్లకు కోట్లల్లో లాభాలు కురిపిస్తున్న ఓయో హోటల్స్, మహేష్ హీరోయిన్ కూడా.. ఎవరెవరు ఎంత మొత్తం అంటే

హోటల్ రంగంలో ఓయో సంస్థ గత కొన్నేళ్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓయో సంస్థ వందల కోట్ల బిజినెస్ గా మారిపోయింది. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుంటాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 16 2025, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హోటల్ రంగంలో ఓయో సంస్థ గత కొన్నేళ్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓయో సంస్థ వందల కోట్ల బిజినెస్ గా మారిపోయింది. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుంటాయి. ఓయో హోటల్ రంగంలో వస్తున్న లాభాలు చూసి సెలెబ్రిటీలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సెలెబ్రిటీలు చాలా మంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒకవైపు సినిమా రంగంలో రాణిస్తూనే మరోవైపు వ్యాపారాల్లో సైతం లాభాలు పొందుతున్న సినీతారలు ఉన్నారు. ఓయో హోటల్స్ లో అద్భుతమైన రిటర్న్స్  వస్తుండడంతో చాలా మంది హీరోయిన్లు ఈ సంస్థలో షేర్లు కొంటున్నారట. ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

35

80, 90 దశకాలలో భారత చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన మాధురి దీక్షిత్ ఓయో హోటల్స్ లో భారీ మొత్తంలో షేర్లు కొన్నారట. తన భర్త శ్రీరామ్ నేనేతో కలసి ఆమె ఏకంగా 2 మిలియన్ల షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. ఓయో సంస్థకి వస్తున్న లాభాలతో మాధురి దీక్షిత్ ఇంత భారీ మొత్తంలో షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. 

45

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరి ఖాన్ డిజైనర్ గా రాణిస్తూనే వ్యాపారాల్లో సైతం బిజీగా ఉన్నారు. ఆమె ఓయో సంస్థలో ఏకంగా 2.4 మిలియన్ల షేర్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఓయో జి ఫండింగ్ రౌండ్ లో భాగంగా గౌరి ఖాన్ ఈ షేర్లు సొంతం చేసుకున్నారట. 

55

ఇక ఓయోలో ఇన్వెస్ట్ చేసిన మరో హీరోయిన్ అమృత రావు. అమృత రావు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది. అమృతరావు తన భర్త ఆర్జే అన్మోల్ తో కలసి ఓయోలో షేర్లు కొన్నారట. మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఓయో షేర్లు దక్కించుకునేందుకు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: మొదటి రోజే రూ.100 కోట్లు దాటుతుందా.. ఈ బజ్ తో రణ్‌బీర్ సినిమాకి అది సాధ్యమేనా ?
Recommended image2
Heroes Without Makeup: మేకప్‌ లేకుండా స్టార్‌ హీరోలు.. అసలు రూపాలు చూస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Jana Nayagan: జన నాయకుడు సినిమా చూస్తూ త్రిష రచ్చ.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved