- Home
- Entertainment
- అప్పుడు సమంత, ఇప్పుడు రాశీఖన్నా.. బాలీవుడ్ లో జెండా పాతేందుకు అదే ప్లాన్.. ఒక్క దెబ్బతో గేమ్ ఛేంజ్!
అప్పుడు సమంత, ఇప్పుడు రాశీఖన్నా.. బాలీవుడ్ లో జెండా పాతేందుకు అదే ప్లాన్.. ఒక్క దెబ్బతో గేమ్ ఛేంజ్!
సమంత ఒక్క సిరీస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు అదే దారిలో మరో ముద్దుగుమ్మ రాశీఖన్నా వెళ్లబోతున్నట్టు అనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ ప్లాన్ అదే చర్చకి దారి తీస్తుంది. ఒక్క దెబ్బతో గేమ్ ఛేంజ్ చేసింది.

సమంత(Samantha)కి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది `ది ఫ్యామిలీ మ్యాన్ 2` (The Family Man 2) సిరీస్. ఇది పాన్ ఇండియా లెవల్లో విడుదలై ఆకట్టుకుంది. ఇందులో సమంత రాజీ పాత్రలో అదరగొట్టింది. తన విశ్వరూపం చూపించింది. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె నటన, యాక్షన్ వాహ్ అనిపించేలా సాగడం విశేషం. ఈ ఒక్క సిరీస్‌తో బాలీవుడ్‌లో గుర్తింపుని తెచ్చుకుంది. పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
`ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తర్వాత సమంతకి బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె ఇప్పుడు `సిటాడెల్` రీమేక్ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తుంది. మరోసారి యాక్షన్‌కి రెడీ అవుతుంది. దీంతోపాటు ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్, మూడు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. వాటిలో అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా వంటి హీరోలతో సినిమాలుండటం విశేషం. అంతేకాదు బాలీవుడ్‌లో బిజీ కావడంతో తన మకాం ముంబయికి మార్చేసింది సమంత.
Farzi Review
ఇప్పుడు అదే దారిలో వెళ్తుంది హాట్ బ్యూటీ రాశీఖన్నా(Raashi Khann). ఆమె ప్లాన్స్ చూడబోతుంటే అలానే అనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆమె `ఫర్జీ` (Farzi) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌లతో కలిసి నటించింది. రాజ్ అండ్ డీకే రూపొందించారు. గత శుక్రవారం విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతుంది. ఇందులో రాశీఖన్నా చేసే యాక్షన్ సీక్వెల్స్ లు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సిరీస్‌తో రాశీఖన్నాకి కూడా నార్త్ లో మంచి క్రేజ్, గుర్తింపు వస్తుంది. ఆమె నటన గురించి చర్చ జరుగుతుంది. నకిలీ కరెన్సీ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో ఫేక్ కరెన్సీ ఎక్స్ పర్ట్ గా మేఘా పాత్రలో రాశీఖన్నా అదరగొట్టింది. నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. దీంతో రాశీఖన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.
Raashi Khanna
ఇదిలా ఉంటే రాశీఖన్నా సినిమా ఎంట్రీ బాలీవుడ్ మూవీ `మద్రాస్ కేఫ్`తోనే జరిగింది. కానీ పెద్దగా ఆమెకి గుర్తింపు రాలేదు. గతేడాది `రుద్ర` అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. కానీ అంత పేరు రాలేదు. అవి సక్సెస్ అయితేనే ఏ ఆర్టిస్ట్ కైనా పేరొస్తుంది. ఇప్పుడు `ఫర్జీ`తో ఆ క్రేజ్‌ని, గుర్తింపుని తెచ్చుకుంది రాశీఖన్నా. అయితే బాలీవుడ్‌లో రాణించేందుకు చాలా మంది కథానాయికలు ప్రయత్నించారు. తమన్నా, కాజల్ వంటి వారు వెబ్ సిరీస్ చేశారు. కానీ అవి సక్సెస్ కాలేకపోవడంతో వారు అక్కడ పాగా వేయలేకపోయారు. కానీ రాశీ మాత్రం ఒక్కదెబ్బతో హాట్ కేక్‌లా మారిపోయిందని చెప్పొచ్చు.
అప్పుడు `ది ఫ్యామిలీ మ్యాన్ 2`తర్వాత సమంత ఎలా బాలీవుడ్‌లో పాపులర్ అయి వరుస అవకాశాలు దక్కించుకుంటుందో, ఇప్పుడు రాశీఖన్నా కూడా అలానే బాలీవుడ్‌లో జెండా పాతే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అక్కడ ఈ బ్యూటీకి ఆఫర్లు స్టార్ట్ అయినట్టు సమాచారం. అనుకున్నట్టు జరిగితే రాశీఖన్నా బాలీవుడ్‌లో త్వరలోనే దున్నేయడం ఖాయమంటున్నారు క్రిటిక్స్.