- Home
- Entertainment
- ‘డీజే టిల్లు 2’ హీరోయిన్ మళ్లీ మారిందా.. ఇంతకీ రీజన్ ఏంటీ.. అందుకే నో చెబుతున్నారా?
‘డీజే టిల్లు 2’ హీరోయిన్ మళ్లీ మారిందా.. ఇంతకీ రీజన్ ఏంటీ.. అందుకే నో చెబుతున్నారా?
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు 2’. ఈ మూవీలో హీరోయిన్ పై స్పష్టత రావడం లేదు. రోజుకో పేరు వినిపిస్తోంది. అసలు ఇంతమంది హీరోయిన్లు నో చెప్పడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది యూత్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘డీజే టిల్లు’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) - గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగ ప్రొడ్యూస్ చేశారు. సినిమాకు అదిరిపోయే క్రేజ్ రావడంతో వెంటనే వెంటనే సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశారు. షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే పార్ట్ 2లో చాలా మార్పులు చేస్తున్నారు.
ముఖ్యంగా DJ Tillu 2 హీరోయిన్ ఎంపిక చాలా ఆసక్తికరంగా మారింది. మొదట హ్యాట్రిక్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama)ను ఓకే చేసినట్టు ప్రచారం జరిగింది. షూటింగ్ లోనూ జాయిన్ అయ్యిందని సమాచారం. కానీ కొద్దిరోజులకే ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకుంది. అంతకు ముందే శ్రీలీలా కూడా చిత్రానికి నో చెప్పింది.
అనుపమా ప్లేస్ లోకి కేరళ కుట్టి మడోన్న సెబాస్టియన్ (Madonna Sebastian) పేరు వచ్చి చేరింది. వారం పదిరోజులుగా ఈ బ్యూటీ పేరు మారుమోగుతోంది. ఉన్నట్టుండి మడోన్నా కూడా ‘డీజే టిల్లు 2’కు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
మడోన్నాకు బదులు ‘హిట్ 2’తో హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)నీ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ వరుసగా హీరోయిన్లు నో చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సిద్దు జొన్నలగడ్డ ని హీరోయిన్లు తట్టుకోలేకపోతున్నారట. సిద్దుతో హీరోయిన్లకి సెట్ కావడం లేదని, సిద్దు ఇబ్బంది పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోతో ఏర్పడే విభేదాల కారణంగానే హీరోయిన్లు నో చెబుతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుందని తెలుస్తోంది.
ఇక మీనాక్షినైనా ఫైనల్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఏదేమైనా ‘డీజే టిల్లు’2 కోసం ఆడియెన్స్, సిద్ధు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాను రూపొందిస్తున్నారు. పార్టు ఎక్కువ భాగం విదేశాల్లోనే ఉంటుందని తెలుస్తోంది.