జూనియర్ సమంత అయిపోయింది.. ఇక తెరపైకి జూనియర్ త్రిష, సోషల్ మీడియాలో హల్ చల్
ప్రపంచంలో మనుషులుపోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. మూములు మనుషుల సంగతి ఏమో కాని.. సెలబ్రిటీలను పోలిన కామన్ ఆడియన్స్ కనిపిస్తే మాత్రం అది నిజంగా విచిత్రమే. ఇప్పుడు లాంటి చిత్రం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. స్టార్ హీరోయిన్ త్రిషను పోలిన ఓ అమ్మాయిని గురించి తెలుసుకుందాం.

సెలబ్రిటీలకు డూప్ లను మనం సాధారణంగా చూస్తుంటాం. అది కూడా హీరోలకు డూప్ లను మాత్రమే చూసి ఉంటాం. కాని ఈ మధ్య హీరోయిన్లను పోలిన అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. వారు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. జూనియర్ సమంతగా అష్షు రెడ్డి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బిగ్ బాస్ కు కూడా వెళ్లింది. ఇప్పుడు బుల్లితెరపై సెలబ్రెటీ హోదాలో ఉంది. ఇలా అలాగే మరో హీరోయిన్ కు ప్రింట్ తయారయ్యింది.
ఇండస్ట్రీకి వచ్చిదగ్గర దగ్గరగా 20 ఏళ్లు అవుతున్నా.. ఇంకా అదే స్టార్ ఇమేజ్ తో.. తన మార్క్ యాక్టింగ్ తో .. దూసుకుపోతున్న హీరోయిన్ త్రిష. 40 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తోంది. ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న నటిగా త్రిష పేరు తెచ్చుకున్నారు.
ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను పోలిన మనుషులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. హీరోయిన్ త్రిషని పోలిన ఓ అమ్మాయి ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు దీపికా విజయ్.
అచ్చం త్రిషలా ఉన్న ఈ అమ్మాయి ఫేస్ అచ్చం త్రిషలాగే ఉంటుంది. కాని ఈ స్టార్ హీరోయిన్ కంటే.. ఆ అమ్మాయి కాస్తసన్నగా ఉంటారు. ఈ అమ్మాయి ఫోటోలను చూస్తే హీరోయిన్ త్రిష ఇలా సన్నబడిందేమిటి అన్నట్టు అనిపిస్తుంది. అచ్చం త్రిషని పోలిన ఈ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షురెడ్డి ఎలాగైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిందో.. ఈ జూనియర్ త్రిష కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. . ఈ రీల్స్, ఫోటోలలో అచ్చం త్రిషని పోలి ఉండడంతో ఈమె త్రిషకి చెల్లెలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్రిషన్ పోలి ఉన్న ఈ దీపికా విజయ్ కర్నాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.