ది ఫ్యామిలీ మాన్ 2.. సమంతకు నాకు మధ్య అలాంటి సన్నివేశాలు తొలగించారు
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సక్సెస్ తో సమంత పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగింది.బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో రెండవ సీజన్ గా వచ్చిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్ రాబడుతుంది.
తమిళ్ రెబల్ గా రాజీ పాత్రలో సమంత పరకాయ ప్రవేశం చేశారు. లేడీ టెర్రరిస్ట్ గా సమంత డీగ్లామర్ రోల్ లో అదరగొట్టారు. నెగిటివ్ షేడ్స్ కలిగిన డీగ్లామర్ రోల్ ని సమంత పోషించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ప్రధాన పాత్ర చేసిన మనోజ్ బాజ్ ఎప్పటిలాగే తన మార్క్ నటనతో దుమ్మురేపాడు. ఫ్రస్ట్రేటెడ్ ఫ్యామిలీ మాన్ గా హ్యూమర్, యాక్షన్ జోడించిన ఆయన పాత్ర ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచింది.
కాగా ఈ సిరీస్ నందు మరో కీలక రోల్ చేశాడు షాహబ్ అలీ. తాజా ఇంటర్వ్యూలో షాహబ్ అలీ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. సిరీస్ లో సమంతతో కూడిన తన సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసివేశారట.
ఈ సిరీస్ నందు సమంతతో షాహబ్ అలీకి రొమాంటిక్ ట్రాక్ ఉందట. వీరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, ఇంటిమసీ సంఘటనలు ఉంటాయట. అయితే సిరీస్ పరిధి పరిగణలోకి తీసుకొని సదరు సన్నివేశాలు తొలగించారట.
సహజంగా ప్రాధాన్యత, పరిధి రీత్యా కొన్ని సన్నివేశాలు తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాసెస్ లోనే సమంతతో నా సన్నివేశాలు తొలగించారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు అని షాహబ్ అలీ తెలిపారు.
ఇక తమిళులు ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సిరీస్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తున్నారు. సమంతను సైతం తమిళులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది.