MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఆ తెలుగు స్టార్‌ జంట గర్భం దాల్చలేదు.. సరోగసి ద్వారానే పిల్లలు కన్నారు.. వేణు స్వామి సంచలన ఆరోపణలు

ఆ తెలుగు స్టార్‌ జంట గర్భం దాల్చలేదు.. సరోగసి ద్వారానే పిల్లలు కన్నారు.. వేణు స్వామి సంచలన ఆరోపణలు

వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్టార్‌ సెలబ్రిటీ జంట సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారంటూ బాంబ్‌ పేల్చాడు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 10 2024, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ వార్తలు నిలుస్తూ వచ్చాడు. కెరీర్‌ గురించి, డౌన్ ఫాల్‌గురించి, పెళ్లిళ్లు, పెటాకులు అంటూ హాట్‌ కామెంట్లతో దుమారం రేపుతున్నాడు. ఇలా సంచలన, వివాదాస్పద జ్యోతిష్యుడిగా మారిపోయాడు వేణు స్వామి. సినిమా సెలబ్రిటీలే కాదు, రాజకీయ నాయకులు జాతకాలు కూడా చెబుతూ చర్చనీయాంశంగా మారుతున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వేణు స్వామి టార్గెట్ ఎక్కువగా సినిమా సెలబ్రిటీలే కావడం గమనార్హం. వారి గురించి చెబితేనే త్వరగా ఫేమస్‌ కావొచ్చు అనేది ఆయన ప్లాన్‌. ఆ రకంగానే బాగా ఫేమస్‌ అయ్యాడు, దానికి తగ్గట్టుగానే బాగానే కూడబెట్టుకున్నారనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. కెరీర్‌ బాగాలేని హీరోయిన్లు కూడా ఆయన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం గమనార్హం. 
 

37
Venu Swamy

Venu Swamy

తరచూ స్టార్‌ హీరోలు, హీరోయిన్ల జాతకాలను తెరపైకి తెస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతుంటారు. తాజాగా ఉగాది సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకి సంబంధించిన కొన్ని ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను బయటపెట్టాడు వేణు స్వామి. ముఖ్యంగా సెలబ్రిటీల సంతానం గురించి బాంబ్‌ పేల్చాడు. ఇవి షాకింగ్‌ నిజాలు అంటూ యూట్యూబ్‌ ఛానెల్‌లో రెచ్చిపోయాడు. 
 

47

సెలబ్రిటీల సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. నయనతార ప్రస్తావన తెచ్చి.. ఆమె అందం కోసం గర్భం దాల్చలేదనేది అబద్దమని, ఆమెకి సంతానం అయ్యే భాగ్యం లేదని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ఓ టాలీవుడ్‌ సెలబ్రిటీ జంటపై కూడా సంచలన ఆరోపణలు చేశాడు. సెలబ్రిటీలు గర్భం పేరుతో మోసం చేస్తున్నారని, వారంతా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 

57

`హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే ఇద్దరు సెలబ్రిటీలు, లాస్ట్ వన్‌, టూ ఇయర్స్ లో పిల్లల్ని కన్న ఇద్దరు సెలబ్రిటీలు కూడా సరోగసి ద్వారానే బిడ్డకి జన్మనిచ్చారు` అంటూ బాంబ్‌ పేల్చాడు వేణు స్వామి. వాళ్లు గర్భం దాల్చారనేది వాస్తవం కాదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని, వాళ్లు గర్భం దాల్చారనేది వాస్తవం కాదన్నారు. 
 

67

గర్భం దాల్చిన మహిళ గర్భం, డెలివరీ టైమింగ్‌ని బట్టి ఈ సెలబ్రిటీలు గర్భం దాల్చినట్టు ప్లాన్‌ చేస్తున్నారని, ఆ మహిళ డెలివరీ టైమ్‌కి ఆసుపత్రికి వెళ్లి, వీరే పిల్లల్ని కన్నట్టు సినిమాటిక్‌ డ్రామా క్రియేట్‌ చేసి పిల్లలతో బయటకు వస్తున్నారని, అదంతా ఫేక్‌ అని వెల్లడించారు. వారి పేర్లు తాను చెప్పను అని, చెబితే పెద్ద రచ్చ అవుతుంది, వాళ్ల మీద పడి ఏడవడం అవుతుందన్నారు వేణు స్వామి. క్యూబ్‌ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాలను వెల్లడించారు.
 

77
Ram Charan - Upasana

Ram Charan - Upasana

దీంతో ఆ పెద్ద సెలబ్రిటీలు ఎవరు అని వెతికే పనిలో నెటిజన్లు ఉన్నారు. ఇటీవల పిల్లల్ని కన్నవారిలో రామ్‌ చరణ్‌, ఉపాసన జంట ఉన్నారు. నిఖిల్‌, యంగ్ హీరో సుహాస్‌ తండ్రి అయ్యారు. వీళ్లల్లో ఎవరు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. అయితే వీరిలో కూడా ఫిల్టర్‌ చేసి ఆ పెద్ద సెలబ్రిటీలే అంటూ గుసగుసలు స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఏదేమైనా వేణు స్వామి పెట్టిన ఈ మంట నెమ్మదిగా టాలీవుడ్‌లో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved