Tanuja Gowda: తన వీక్‌నెస్ బయటపెట్టిన తనూజ.. పేరెంట్స్ చేసిన తప్పుకి ఆవేదన
బిగ్ బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రాణిస్తోన్న తనూజ పుట్టస్వామి తన వీక్‌నెస్‌ని బయటపెట్టింది. తనకు ఉన్న సమస్యని చెప్పి ఆవేదన చెందింది. ఇంతకి ఏంటా సమస్య అంటే..

బిగ్ బాస్ తెలుగు 9 లో రచ్చ చేస్తోన్న తనూజ గౌడ
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో రచ్చ చేస్తోంది టీవీ నటి తనూజ గౌడ. తనదైన గేమ్ లతో ఆకట్టుకుంటోంది. ఎలాంటి టాస్క్ ల్లో అయినా శివంగిలా పోరాడుతోంది. ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తోంది. అదే సమయంలో భరణితో క్లోజ్‌గా ఉంటుంది. ఆయన్ని తండ్రిగా భావిస్తోంది. భావించడమే కాదు, నాన్నా నాన్నా అని పిలుస్తోంది. నిజంగానే తండ్రి కూతుళ్ల బాండింగ్‌ని తెలియజేస్తున్నారు. గేమ్స్ లో ఏమాత్రం అవకాశం ఉన్న సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే ప్రతి దానికి ఏడుస్తుందనే విమర్శ ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు సైతం తనూజని టార్గెట్ చేశారు. భరణితో తమ బాండింగ్‌పై వాళ్లు దెబ్బ కొడుతున్నారు. ఆ బాండింగ్‌లను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడు రోజులుగా హౌజ్‌లో ఇదే జరుగుతుంది. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఆయేషా జీనత్ ఆమెని టార్గెట్ చేసి మాట్లాడింది. రిలేషన్స్ వెనక దాక్కోవద్దని, దాన్నుంచి బయటకు వచ్చి సొంతంగా గేమ్స్ ఆడాలని చెప్పడం విశేషం.
తన వీక్ నెస్ బయటపెట్టిన తనూజ
ఈ నేపథ్యంలో ఇప్పుడు తనూజకి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఆమె తన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం చక్కర్లు కొడుతుంది. ఈ ఇంటర్వ్యూలో తన వీక్‌నెస్ బయటపెట్టింది తనూజ. ఫిజికల్‌గా తాను చాలా వీక్ అని చెప్పింది. ఒక ప్రశ్నకి సమాధానం చెబుతూ, అందరి బాడీ ఒకేలాగా ఉండదని, అందరి స్టామినా ఒకేలా ఉండదని, తన విషయానికి వస్తే, తాను చాలా వీక్ అని, చాలా సెన్సిటివ్ అని చెప్పింది. పక్కన ఉన్న మరో సెలబ్రిటీ ఆమె గురించి చెబుతూ, మనం ఆమెని గట్టిగా పట్టుకుంటే ఐదు నిమిషాల తర్వాత కూడా ఆ మార్కులు(అద్దులు) అలానే ఉంటాయని చెప్పాడు. తనకు హ్యాపీగా నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం వచ్చుగానీ, కష్టపడి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ పని చేయడం తన వల్ల కాదని తెలిపింది తనూజ.
పేరెంట్స్ అలా పెంచడంపై ఆవేదన
చిన్నప్పట్నుంచి తనకు ఆ అలవాటు లేదని, ఈ విషయంలో తన అమ్మని, అమ్మమ్మని చాలా సార్లు తింటానని, ఎందుకు తనని ఇలా పెంచారని ఆవేదన చెందినట్టు తెలిపింది. చిన్నప్పట్నుంచి ఏదైనా పని చెప్పి స్ట్రాంగ్‌గా పెంచొచ్చు కదా అని బాధపడుతుందట. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది తనూజ. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బెంగుళూరుకి చెందిన తనూజ 1992 మార్చి 5న జన్మించింది. ఆమెకి అనుజా, పూజా అనే ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. గ్రాడ్యూయేట్ పూర్తి చేసి సినిమాల్లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకుంది. కన్నడలో హర్రర్ ఫిల్మ్ `సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టూ టూ` అనే చిత్రంలో నటించింది. దీన్ని `చిత్రం కాదు నిజం` అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు. దీంతోపాటు `దండే బాయ్స్` చిత్రంలో మెరిసింది.
`ముద్ద మందారం`తో పాపులర్
ఈ క్రమంలో ఆమె `అందాల రాక్షసి` సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత `ముద్దమందారం` సీరియల్‌లో మెరిసింది. ఇది పెద్ద హిట్ అయ్యింది. దీంతో తనూజకి మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెర స్టార్ అయ్యింది. ఆ తర్వాత `అగ్ని పరీక్ష`లో నటించింది. ఇలా వరుసగా తెలుగుతోపాటు, తమిళం, కన్నడలోనూ సీరియల్స్ చేసింది. స్టార్ అయిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది. ఆటతో అలరిస్తూనే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది తనూజ.