పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ నిజమే..నిర్మాత మనసులో మాట బయట పెట్టేశారు, గురూజీపై ఫ్యాన్స్ లో టెన్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సినిమాకి మించిన బంధం. వీరి పేరు చెప్పగానే ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల కంటే ముందుగా ఫ్రెండ్ షిప్ గుర్తుకు వస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సినిమాకి మించిన బంధం. వీరి పేరు చెప్పగానే ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల కంటే ముందుగా ఫ్రెండ్ షిప్ గుర్తుకు వస్తుంది. అంతలా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య సాన్నిహిత్యం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరగా మహేష్ బాబుతో గుంటూరు కారం చిత్రం తెరకెక్కించారు.
అయితే ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి వినోదం అందించలేదు. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద సోసో గా ఆడింది. గతంలో మాదిరిగా త్రివిక్రమ్ పెన్నులో పదును కనిపించడం లేదు అనే విమర్శలు నెమ్మదిగా షురూ అయ్యాయి.
pawan kalyan
దీనితో త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఏంటనే డైలమా అభిమానుల్లో ఉంది. వాస్తవానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. కానీ బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ తదుపరి ప్లాన్ ఏంటో తెలియడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అనే న్యూస్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హోల్డ్ లో పెట్టిన చిత్రాలన్నీ ఎన్నికల తర్వాత షురూ కానున్నాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు.
ఈగల్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో తాము చిత్రం ప్లాన్ చేస్తున్న మాట వాస్తవమే అని అన్నారు. అయితే త్రివిక్రమ్, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మొదలు పెడతాం అని తెలిపారు.
పవన్, గురూజీ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో ఎంత ఆసక్తి ఉందో అంతే టెన్షన్ కూడా ఉంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గుంటూరు కారం చిత్రం కూడా అంతగా ప్రభావం చూపలేదు. దీనితో త్రివిక్రమ్ ఏం చేస్తారో అనే టెన్షన్ ఉండడం సహజమే.