- Home
- Entertainment
- మత్తెక్కించే అందాలతో కవ్విస్తున్న కలర్ ఫోటో బ్యూటీ చాందిని చౌదరి... ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!
మత్తెక్కించే అందాలతో కవ్విస్తున్న కలర్ ఫోటో బ్యూటీ చాందిని చౌదరి... ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!
తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి సైతం హద్దులు చెరిపేస్తుంది. అందాల ఆరబోతలో తగ్గేదే అంటుంది. ఎల్లో ట్రెండీ వేర్ లో చాందిని చౌదరి సరికొత్త గ్లామర్ తో చిత్తు చేసింది. చాందిని మత్తెక్కించే అందాలు కవ్విస్తున్నాయి. చాందిని లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

Chandini Chowdary
కాగా చాందిని చౌదరి నటించిన కలర్ ఫోటో(Color Photo) మూవీ నేషనల్ అవార్డు గెలుపొందిన నేపథ్యంలో ఆమె ఫుల్ ఖుషీగా ఉన్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కలర్ ఫోటో ఫీచర్డ్ విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించగా ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
Chandini Chowdary
కలర్ ఫోటో మూవీ జాతీయ అవార్డు అందుకున్న నేపథ్యంలో చాందిని పేరు మారుమ్రోగుతుంది. ఆమె ఇమేజ్ కొంత మెరుగైంది. ఈ పరిణామం ఆమె కెరీర్ కి ప్లస్ కానుంది. మరోవైపు చాందిని చౌదరి హీరోయిన్ గా బిజీ అవుతున్నారు. ఆమెకు తెలుగుతో పాటు తమిళంలో ఆఫర్స్ వస్తున్నాయి.
Chandini Chowdary
ఇటీవల ఆమె ఓ కోలీవుడ్ మూవీ ప్రకటించారు. యంగ్ హీరో అశోక్ సెల్వన్ కి జంటగా మీ నటిస్తున్నారు. కోలీవుడ్ లో ఆమెకు ఇది తొలిచిత్రం. బ్రేక్ దొరికితే అక్కడ స్టార్ కావడం ఖాయం. తెలుగు హీరోయిన్స్ కి అక్కడ డిమాండ్ ఎక్కువే. తెలుగులో సక్సెస్ కానీ అంజలి, శ్రీదివ్య లాంటి వారు తమిళంలో ఓ స్థాయి హీరోయిన్స్ గా ఎదిగారు.
Chandini Chowdary
ఇక చాందిని(Chandini Chowdary) కెరీర్ పరిశీలిస్తే... ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది. 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చాందిని చిన్న పాత్ర చేశారు. కేటుగాడు చిత్రంతో ఫస్ట్ టైం టైటిల్ క్రెడిట్ దక్కించుకున్నారు.
Chandini Chowdary
కుందనపుబొమ్మ, శమంతకమణి చిత్రాల్లో హీరోయిన్ గా చాందినికి అవకాశం వచ్చింది. ఆ చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే హౌరా బ్రిడ్జ్, మను ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు.
Chandini Chowdary
చాందిని చౌదరికి ఫస్ట్ హిట్ కలర్ ఫోటో. అయితే ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కాలేదు. కరోనా కారణంగా నేరుగా తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో విడుదల చేశారు. కలర్ ఫోటో చిత్రానికి ట్రెమండస్ టాక్ దక్కింది.
Chandini Chowdary
కలర్ ఫోటో అనంతరం సూపర్ ఓవర్, సమ్మతమే చిత్రాల్లో చాందిని హీరోయిన్ గా నటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా విడుదలైన సమ్మతమే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ నిర్మాతలకు లాభాలు పంచినట్లు సమాచారం. అలా చాందిని స్టార్ కావాలన్న తన కలల వైపు అడుగులు వేస్తుంది.
Chandini Chowdary
అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. తన ఫ్యాన్ బేస్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాందిని గ్లామరస్ ఫోటోస్ తరచుగా వైరల్ అవుతున్నాయి.