Hanuman Trailer : తేజ సజ్జా ‘హనుమాన్ ట్రైలర్’ రివ్యూ... ఎలా ఉందంటే?
యంగ్ హీరో తేజా సజ్జా నుంచి వస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ Hanuman. తాజాగా ‘హనుమాన్’ ట్రైలర్ ను విడుదల చేశారు. తేజా సజ్జా యాక్షన్, విజువల్స్, మ్యూజిక్, హనుమాన్ ను చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

యువ హీరో తేజా సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ (Hanu Man). యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పాన్ వరల్డ్ గా రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 11 దేశాల్లో రిలీజ్ చేస్తుండటం విశేషంగా మారింది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. భారీ హైప్ ను క్రియేట్ చేసింది. తేజా అద్భుతం చేయబోతున్నాడనేది స్పష్టం అవుతోంది. ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలో కొద్దిసేపటి కింద Hanuman Trailer విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ ను పరిశీలిస్తే.. అతీత శక్తులు ఉన్న సూపర్ మ్యాన్ గా తేజా అలరించబోతున్నారు. అటవీకి దగ్గరి ప్రాంతంలో నివసించేప్రజల్లో ఒక్కడే హనుమాన్ (తేజా). తన శక్తులతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.
అటవీ జంతువుల నుంచి, దుండగుల నుంచి ప్రజలను కాపాడుతుంటాడు. ఇక వారు నివసించే ప్రాంతంలో ఆంజనేయుడి ప్రసాధించిన ఓ అద్భుతమైన శక్తి ఉంటుంది. దాంతో సూపర్ మ్యాన్ అవ్వాలని మైఖేల్ ప్రయత్నిస్తుంటాడు. దాన్ని దక్కించుకునేందుకు జనాలు, తేజాపై దాడికి దిగుతారు. అంతేకాదు టెక్నాలజీని వినియోగిస్తారు. ఇక ఆ వ్యక్తి నుంచి తేజా తన ప్రజలను ఎలా కాపాడాడు. ఆ శక్తి ఏంటీ? తేజాకు అతీత శక్తులు ఎలా వచ్చాయి.
హనుమాన్ తన భక్తుడిని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, ట్రైలర్ విజువల్ వండర్ గా కనిపిస్తోంది. చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే గ్రాఫిక్స్, మంత్రముగ్ధులను చేసే నేపథ్య సంగీతం, అబ్బుర పరిచే యాక్షన్ సీన్లతో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
అయితే, ఈ ఏడాది ఆడియెన్స్ ‘ఆదిపురుష్’ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ విజువల్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలోనే ‘హానుమాన్’ నుంచి టీజర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజువల్స్ అద్భుతంగా కనిపించారు.
ఆదిపురుష్, హనుమాన్ సినిమాలు జోనర్ పరంగా వేరైనా... హానుమాన్ ను చూపించడంతో పోలికలు కలిగి ఉంది. Adhipurushలో హనుమాన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. కానీ విజువల్ వండర్ గా వచ్చినా ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేపోయింది. ఇక ఆడియెన్స్ కు Hanuman Movieతో ఆ తృప్తి దక్కుతుందని ఆశిస్తున్నారు.
దైవభక్తిని, దేశభక్తిని కూడా ప్రశాంత్ వర్మ చక్కగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అలాగే సైన్స్ ను కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. చిరుతపులితో పరిగెత్తడం, కొండను ఎత్తడం, హనుమాన్ భారీ విగ్రహం, వరలక్ష్మి మాస్ సీన్స్, బీజీఎం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్. 12 జనవరి 2024న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.గెటప్ శ్రీను, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.