MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా ఏదో ఒక విషయం మిగిలిపోతూనే ఉంటుంది. ఆమెజీవితంలో చేసిన ఎన్నో గొప్ప పనులు ఎవరో ఒకరు చెప్పగా తెలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ  హీరోయిన్ సావిత్రి మంచితనం గురించి తన ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నారు. ఇంతకీ ఆవిడి ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2025, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Savitri Gemini Ganesan

Savitri Gemini Ganesan

ఎంత గొప్ప జీవితం అనుభవించిందో.. అన్ని కష్టాలు కూడా అనుభవించారు మహానటి సావిత్రి. నటిగా స్టార్ డమ్ చూసింది, సంపద విషయంలో రాణిలా బ్రతికింది. చేతికి ఎముకలేనట్టుగా దాన ధర్మాలు చేసింది. ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేసింది. ఆడపిల్లల పెళ్లిల్లు చేసింది. ఆమె చేతి నుంచి సాయం పొందిన చాలామంది.. ఆతరువాత సావిత్రి కష్టాల్లో ఉన్న సమయంలో ఏమాత్రం సాయం చేయడానికి ముందుకు రాలేదు. 

Also Read: నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Savitri

Savitri

సావిత్రి పరిస్థితి తెలిసి.. ఎవరు ఆమెను పలకరించలేదు. అయినా సరే సావిత్రి ఏ విషయంలో క్రుంగిపోలేదు. ధైర్యంగా బ్రతికింది. తన దగ్గర సపంద లేని టైమ్ లో కూడా చేయి చాచిన వారికి ఏదో ఒక రకంగా సాయం చేస్తూ వచ్చింది సావిత్రి. అంత మంచితనం వల్లనే కావచ్చు ఇప్పటికీ ఆమె అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మహానటిగా మిగిలిపోయింది. 

36

ఎంతో మంది అభిమానులు ఇప్పటికీ సావిత్రిని రోజుకు ఒక్క సారి అయిన తలుచుకుని బాధపడుతుంటారు. ఇక సెలబ్రిటీలు చాలామంది సావిత్రితో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలోనే ఓ సీనియర్ నటి,  ఆతరం హీరోయిన్ కె విజయ సావిత్రికి సబంధించిన ఓ సంఘటను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఆమె మంచితనం ఎలా ఉంటుందో వివరించారు. ఇంతకీ కే విజయ  ఏం చెప్పారంటే? 

46

నటిగా మంచి బిజీగా ఉన్న టైమ్ లో కె విజయ ఓ సారి ట్రైయిన్ లో ప్రయాణిస్తున్నారట. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా  ఫస్ట్ క్లాస్ బోగీలో  ఓంగోలు రాగానే సావిత్రి ఆమె అసిస్టెంట్ ఎక్కారట. అయితే టీసీ వచ్చి టికెట్ అడిగితే  సావిత్రి ఉంది అనుకున్నారట. కాని ఒంగోలు లో ఓ కార్యక్రమంనికి వచ్చిన ఆమెకు.. అక్కడి వ్యక్తులు బాధ్యతగా టికెట్ ఇచ్చి పంపించలేదు. దాంతో సావిత్రి ఇబ్బంది పడ్డారట. 
 

56

టికెట్ చూపించండి.. లేదంటే డబ్బులు కట్టండి.. లేదంటే నెక్ట్స్ స్టేషన్ లో దిగండి అని సావిత్రికి టీసీ చెప్పారు. దాంతో ఆమె గొంతు గుర్తు పట్టి ఎవరా అని చూసిన విజయ సావిత్రి అని తెలిసి వెంటనే డబ్బులు కట్టారట. దాంతో ఎంతో సంతోషించిన సావిత్రి.. విజయను కౌగిలించుకుని చాలా థ్యాంక్స్ అమ్మ.. నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఇంటికి వెళ్ళగానే డబ్బులు పంపిస్తాను అని చెప్పారట.

అనుకున్నట్టుగానే వెళ్లిన రెండో రోజు సావిత్రి ఫోన్ చేశారట. చేసి  డ్రైవర్ కు డబ్బలు ఇచ్చి పంపిస్తున్నాను అని అడ్రెస్ అడిగారట. ఇప్పుడు ఎందుకమ్మా అని అంటే.. లేదమ్మ నువ్వు చేసిన సాయం మామూది కాదు. ఎలా మర్చిపోగలం, అని పదే పదే గుర్తు చేసుకున్నారట. 

66

అంత మంచివారు ఆమె. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే .. ఆపరట సావిత్రి. ఎవరికైనా ఇస్తే మాత్రం వెంటనే మర్చిపోతారట. దానం గుర్తు పెట్టుకోరు సావిత్రి. అందుకే ఆమె డబ్బులు ఇచ్చినవారంతా సావిత్రిని మోసం చేశారు. చివరిక్షణంలో ఆమెకు కాపాడటానికి ఎవరు రాలేదు. ఆర్ధిక ఇబ్బందులు, తాగుడికి బానిసైన సావిత్రి.. కోమాలోకి వెళ్లి 14నెలల వరకూ కోమాలోనే ఉన్నారు. 46 ఏళ్ళ చిన్నవయస్సులో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
సావిత్రి (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved