MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 కోట్లు తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేవా.. సినిమాలన్నా పూర్తి చేసుకో, పవన్ పై ఘాటుగా తమ్మారెడ్డి

50 కోట్లు తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేవా.. సినిమాలన్నా పూర్తి చేసుకో, పవన్ పై ఘాటుగా తమ్మారెడ్డి

పవన్ కళ్యాణ్ పై పొలిటికల్ గా చాలా విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ పై విరుచుకుపడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 30 2023, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది.  నేడు తాజాగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో OG(ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే చిత్రాన్ని ప్రారంభించారు. 

26

పవన్ కళ్యాణ్ పై పొలిటికల్ గా చాలా విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ పై విరుచుకుపడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు. 

36

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్ లో.. తన పిల్లల కోసం దాచుకున్న డబ్బుతో పార్టీ ఆఫీస్ నిర్మించానని కామెంట్స్ చేశారు. దీనిపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ లో వినిపిస్తున్న దానిప్రకారం మీరు 50 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటున్నారు. అంత రెమ్యునరేషన్ తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేరా.. అసలు ఎం మాట్లాడుతున్నారు. మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి రాజకీయాల్లో అల్లరి చేస్తారు. 

46

మీ నాన్న గారు దేవుడు దీపం వద్ద సిగరెట్ వెలిగించుకున్నారు అని అన్నారు. మీ నాన్నగారు నా పర్సనల్ గా తెలుసు. ఆయన అలా ప్రవర్తిస్తారని అనుకోను. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు. కనీసం జైలుకు వెళ్ళలేదు. అంత మంది బౌన్సలర్లతో బిల్డప్ ఎందుకు ? నేను సామాన్యుడినే అంటారు కదా ? అలాగే వెళ్లి ప్రజల్ని కలవండి.. మీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు. 

56
Pawan Kalyan

Pawan Kalyan

వారానికి ఒకసారి రావడం.. మీటింగ్ పెట్టి తిట్టి వెళ్లిపోవడం.. ఎందుకు ఇదంతా. టైం వేస్ట్. ఆ ఒక్కరోజు కూడా రావద్దు. పెండింగ్ లో ఉన్న సినిమాలు అయినా పూర్తి చేయండి. సినిమాలు చేస్తూనే ఉన్నారు.. రాజకీయాలు చేస్తున్నారు. కానీ మీరు గాడి తప్పుతున్నారు. మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి యువకుడు వస్తున్నాడు అని సంతోష పడ్డాం. ఇప్పుడు మీ వైఖరితో విసిగిపోతున్నాం అని తమ్మారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

66

తమ్మారెడ్డి కామెంట్స్ పై పవన్ అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా తమ్మారెడ్డి కామెంట్స్ గురించి హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved