14 ఏళ్ల తరువాత ఆ హీరోయిన్ తో జతకట్టబోతున్న దళపతి విజయ్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఈ స్టార్ హీరో దాదాపు 14 ఏళ్ల తరువాత తన లక్కీ హీరోయిన్ తో సినిమా చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్జ....? ఏంటా సినిమా...?
టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుండే సరికి.. తెలుగు సినిమాను కాస్త తక్కువగా చూసిన బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు కూడా టాలీవుడ్ కు లొంగిపోక తప్పలేదు. అంతే కాదు ఇక్కడ సినిమాలు చేయాలని వాళ్లు ఆరాటపడుతున్నారు.అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..? ఈ క్రమంలోనే కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరో దళపతి విజయ్ కూడా తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తెలుగులో తుపాకి సినిమా నుండి బీస్ట్ వరకు ప్రతి సినిమా సినిమాకు టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు నిర్మాణ సంస్థలో తెలుగు దర్శకుడితోనే వారసుడు సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Vijay
అయితే ఈసినిమా తరువాత విజయ్ తమిళ స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. గతంతో విజయ్ కు వరుస విజయాలు అందించాడు లోకేష్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈమూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.
trisha - vijay
త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది ఈమూవీ ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.ఈ సినిమాలో హీరోయిన్‌గా దాదాపు త్రిష ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దాదాపు 14ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారు. వీళ్ళ కాంబోలో ఇప్పటికే 4 సినిమాలు తెరకెక్కాయి. ఇది అయిదో సినిమా అవుతుంది.
గతంలో వీరి కాంబోలో వచ్చిన ఆ నాలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచాయి. వీరిద్దరు కలిసి చివరిగా 2008లో వచ్చిన కురివి సినమాలో నటించారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
Vijay
ఈమధ్య త్రిష పొన్నియన్ సెల్వన్‌తో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం LCUలో భాగంగానే తెరకెక్కనున్నట్లు ఇటీవలే నటుడు నారైన్ తెలిపాడు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.