టీవీ షో ప్రీ లుక్‌తో దుమ్మురేపుతున్న తమన్నా.. వంటల ప్రోగ్రామ్ టైటిల్ కూడా రివీల్..
తమన్నా ఫస్ట్ టైమ్ తన కెరీర్‌లో ఓ టీవీ షో చేయబోతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని కన్ఫమ్ చేసింది తమన్నా. అంతేకాదు ప్రీ లుక్ కూడా విడుదల చేసింది. కమ్మింగ్ సూన్ అని పేర్కొంది.
మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. వీటితోపాటు ఆమె టీవీ షోస్‌కి కూడా కమిట్ అయ్యింది.
జెమినీ టీవీలో మాస్టర్ చెఫ్ తరహాలో ఓ వంటల కార్యక్రమానికి హోస్ట్గ్, జడ్జ్ గా ఉండబోతున్నట్టు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దాన్ని నిజం చేసింది తమన్నా. ఈ మేరకు ఆమె ప్రీ లుక్‌ని పంచుకుంది.
శుక్రవారం తమన్నా తన టీవీషోకి సంబంధించిన ప్రీలుక్ ని విడుదల చేసింది. ఇందులో తమన్నా బ్యాక్ నుంచి స్లీవ్ లెస్ సిల్కీ గౌన్‌లో నిలబడి ఉండగా, ముందు షోకి సంబంధించిన ప్రిపేర్ చేస్తున్నారు. షూటింగ్‌కి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి.
తాను టీవీ షో చేయబోతున్న విషయాన్ని ఇలా కన్ఫమ్ చేసింది తమన్నా. అంతేకాదు కమ్మిన్ సూన్ అని పేర్కొంది. దీంతోపాటు షో పేరుని కూడా పంచుకుంది. దానికి పేరుని `మాస్టర్ చెఫ్ తెలుగు` గా నిర్ణయించినట్టు ట్యాగ్ `మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు` అని యాష్ ట్యాగ్‌ల రూపంలో పేర్కొంది తమన్నా.
ప్రస్తుతం ఈ ప్రీ లుక్ ఫోటో అభిమానులను, నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోని కన్నడలో సుదీప్ చేస్తున్నారు. అక్కడ బాగా పాపులర్ అయ్యింది. దీంతో తెలుగులో జెమినీటీవీ వాళ్లు తీసుకొస్తున్నారు.
దీంతోపాటు మరో వెబ్ సిరీస్‌కి కమిట్ అయ్యిందట తమన్నా. ఇప్పటికే ఆమె `లెవన్త్ అవర్`, `నవంబర్ స్టోరీ` వెబ్ సిరీస్‌లతో మెప్పించింది. తనలోని మరో యాంగిల్ నటన బయటకు తెచ్చింది. వీటితో తమన్నాకి మంచి ప్రశంసలు దక్కాయి.
ఈ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ ఆఫర్ తమన్నాని వెతుక్కుంటూ వచ్చింది. డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందనుందట. ఇందుతో తమన్నాతో పాటు ఆషిమా గులాటి ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు టాక్. ఈ వెబ్ సిరీస్‌కు `యారీ దోస్తీ` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్‌ను అరుణిమా శర్మ దర్శకత్వంలో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని టాక్.
తమన్నా ప్రస్తుతం `సీటీమార్`, `ఎఫ్ 3`, `గుర్తుందా శీతాకాలం`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. `మ్యాస్ట్రో`లో ఆమెది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఇది హిందీ `అంధాధున్`కి రీమేక్.