- Home
- Entertainment
- #Tamannaah: ఫస్ట్ నైట్ పెళ్లి కూతురు అత్యాచారం మర్డర్ కాన్సెప్టు రిపీటా ?, ఆ బోల్డ్ క్యారక్టర్ లో తమన్నా ?
#Tamannaah: ఫస్ట్ నైట్ పెళ్లి కూతురు అత్యాచారం మర్డర్ కాన్సెప్టు రిపీటా ?, ఆ బోల్డ్ క్యారక్టర్ లో తమన్నా ?
కాలానికి తగినట్లుగా మనమూ మారాలని చెబుతూ ఆమె గతేడాది లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దాలాంటి సిరీస్ లలో తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది.

కెరియర్ మొదట్లో హోమ్లీ పాత్రలు చేసి చాలా మందికి అభిమాన నటిగా మారిన తమన్నా గత కొంతకాలంగా తన రూట్ మార్చుకుంది. మారుతున్న కాలంతో పాటు తనూ మారాలనుకుంటున్నట్లు ఉంది. అందుకు తగ్గట్లే ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటిస్తూ.. అందాల ఆరబోత చేస్తుంది. దీంతో చాలామంది తమన్నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చి ఫుల్ బిజీ అయ్యింది. దాంతో బోల్డ్ గా ఉన్న పాత్రలు సైతం ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా అలాంటి పాత్ర ఒకటి కమిటైందని సమాచారం.
tamannaah
2022లో నేరుగా ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి ఇప్పుడు ఓదెల 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. ఇంతకు ముందు ఆహా ఓటిటిలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లోనూ ఆమె చేసింది. ఇప్పుడీ సీక్వెల్ కు తమన్నా ఓకే చెప్పడంతో ఇందులో ఆమె ఎలాంటి సీన్స్ చేయబోతోందో అన్న ఇంట్రస్ట్ నెలకొంది. అశోక్ తేజ డైరెక్షన్ లో ఈ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 రానుంది. ఈ సినిమాలోనూ కొన్ని సీన్స్ లో స్క్రీన్ పై రెచ్చిపోయి చేయాల్సిన అవసరం ఉందిట. అందుకు తమన్నా తటపాయించకుండా ఓకే చెప్పిందంటున్నారు.
రామ్ చరణ్ తో రచ్చ, రవితేజ తో బెంగాల్ టైగర్, గోపిచంద్ తో సీటీమార్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ ఓదెల 2 మూవీకి క్రియేటర్ గా ఉండనున్నాడు. ఈ సినిమాలలో తమన్నానే హీరోయిన్ గా నటించింది. దాంతో ఆ చనువుతోనే తమన్నాను ఈ చిన్న సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని తమన్నా ఉండటంతో నాలుగైదు భాషల్లో రిలీజ్ చేస్తారంటున్నారు.
ఈ మధ్య కాలంలో స్క్రీన్ పై రెచ్చిపోయి నటిస్తోంది తమన్నా. కాలానికి తగినట్లుగా మనమూ మారాలని చెబుతూ ఆమె గతేడాది లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దాలాంటి సిరీస్ లలో తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. ఇప్పుడు ఓదెల్ 2 మూవీకి సరే అనడంతో ఇందులోనూ ఆమె అలాంటి సీన్స్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. 2023లో ఈ రెండు వెబ్ సిరీస్ లతోపాటు తమిళంలో జైలర్, తెలుగులో భోళా శంకర్ సినిమాల్లోనూ తమన్నా కనిపించింది.
ఈ క్రమంలో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడం ఫై స్పందించింది తమన్నా ...రొమాంటిక్ బెడ్ రూమ్ సన్నివేశాలు చేయాలనే ఆసక్తి లేదు.. కానీ కథ మరియు స్క్రీన్ ప్లే డిమాండ్ చేయడం వల్లే చేయాల్సి వస్తుంది అని తెలిపింది. ఒక హద్దు మేరకు తాను బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తాను అన్నట్లుగా పేర్కొంది. అంతే కాకుండా తన నుండి ముందు ముందు మంచి కంటెంట్ బేస్డ్ సిరీస్ లు మరియు సినిమాలు వస్తాయి అన్నట్లుగా అభిమానులకు హామీ ఇచ్చింది.
ఇక 'ఓదెల రైల్వే స్టేషన్'లో కాన్సెప్టు రెగ్యులర్ గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో కనిపించేది. వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ / హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడమే ఈ సినిమాలోనూ ఉంటుంది. హంతకుడు ఎవరు? అనే అంశంలో మిగతా పాత్రధారులపై అనుమానం కలిగించేలా రచన సాగింది. అయితే... శోభనమైన మరుసటి రోజు పెళ్లి కూతురుపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడమనే అంశం క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేకత అది. ఈ సీక్వెల్ లో కూడా అలాంటి ఓ పాయింట్ ఉందని చెప్తున్నారు.
పార్ట్ 1 కథేమిటంటే...ఓదెల అనే ఓ చిన్న పల్లెటూరి చుట్టూ నడిచే కథ ఇది. అక్కడ రాధ (హెబ్బా పటేల్) దిగువ మధ్య తరగతి మహిళ. ఇస్ర్తీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. భర్త తిరుపతి (వశిష్ట) తాగుబోతు. భార్యపై ప్రేమ ఉంటుంది కానీ చీటికీ మాటికీ అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ జీవితం సాగిస్తుంటాడు. ఆ ఊర్లో.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. శోభనమైన మరుసటి రోజే.. వాళ్లని దారుణంగా అత్యాచారం చేసి హతమారుస్తుంటాడు ఓ సైకో. చిన్న ఊర్లో వరుసగా ఇన్ని హత్యలు జరగడం పోలీసు శాఖని కలవరపెడుతుంది. ఆ ఊరికే కొత్తగా అనుదీప్ (సాయి రోనక్) అనే యువ ఐపీఎస్ అఽధికారి ట్రైనింగ్ నిమిత్తం వస్తాడు. తనకు ఈ వరుస హత్యల ఉదంతం సవాలు విసురుతుంది. మరి అనుదీప్ సైకోని పట్టుకొన్నాడా, లేదా? ఈ సైకోని పట్టివ్వడంలో రాధ చేసిన సహాయం ఏమిటి? అనేది మిగిలిన కథ.
'ఓదెల రైల్వే స్టేషన్' 2 కూడా రా అండ్ బోల్డ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా తీయడం, పల్లెటూరి నేపథ్యం వల్ల కొత్తగా అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకూ వీక్షకులలో ఓ క్యూరియాసిటీ కలిగిస్తూ కథ ముందుకు వెళుతుందని తెలుస్తోంది.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో సినిమాలు చేస్తుంది తమన్నా. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. దక్షిణాది, బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నటి తమన్నా (Tamannaah).
నటి కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తానొక స్టార్‌ని అయ్యానని అన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే తాను ఇప్పటికీ శ్రమిస్తున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు వదిలేసుకుంటున్నాను అంది. అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు’’ అంది.
‘దక్షిణాదిలో హీరోయిజాన్ని హైప్ చేసే సినిమాలు ఎక్కువగా ఉంటాయి కదా. హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కారణంగా మీరు నటించనని ఎప్పుడైనా చెప్పారా?’ అని మీడియా వ్యక్తి ప్రశ్నించగా.. ‘‘సౌత్ లో సులువుగా ఉండే కొన్ని ఫార్ములాలు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని కమర్షియల్ సినిమాల్లో నా పాత్రకు ఇబ్బంది లేకుండా.. హీరోయిజం తీవ్రతను తగ్గించమని దర్శకులను కోరిన సందర్భాలు ఉన్నాయి. రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయడం మానేశా. అలాంటి సినిమాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె రిప్లై ఇచ్చింది.
Tamannaah మాట్లాడుతూ..‘‘కొన్ని కమర్షియల్ సినిమాల్లో నేను నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అందుకే మేకర్స్‌ను నా క్యారెక్టర్ తగ్గించమని కోరేదాన్ని. అలా చూసి చూసి మెల్లగా అలాంటి పాత్రలు చేయడమే మానేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని సెలబ్రేట్ చేసుకొనే సినిమాల్లో భాగం కాకూడదని చేతనైన ప్రయత్నం చేస్తున్నా’’ అని తమన్నా సౌత్‌లోని కమర్షియల్ సినిమాలపై షాకింగ్ చేసింది.
బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో నేను నటించిన పలు సినిమాలు సరిగ్గా ఆడలేదు. అది విధి. దానిని నేను వ్యక్తిగత ఫెయిల్యూర్‌గా ఎప్పటికీ తీసుకోను ఎందుకంటే, ఎంతోమంది కలిసి వర్క్ చేస్తేనే ఒక సినిమా సిద్ధం అవుతుంది’’ అని ఆమె చెప్పారు.
Did Tamannaah Bhatia get breast implants
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం జైలర్ (Jailer). ఈ ఏడాది నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన పాటల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది జైలర్ సాంగ్ నువ్ కావాలయ్య (Kaavaalaa). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) ఈ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ లవర్స్, తమన్నా ఫ్యాన్స్ కు ఈ పాట తెగ నచ్చేసింది.
కావాలా సాంగ్ వేల సంఖ్యలో నెట్టింట రీల్స్ దర్శనమిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమన్నా డ్యాన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇండియాతోపాటు విదేశాల్లో కూడా ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో చిరతో చేసిన భోళా శంకర్ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది.