MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తమన్నా ఆస్తి ఎంత? తనఖా పెట్టి మరీ అంత ఖర్చు దానిపై ఎందుకు పెడుతోంది?

తమన్నా ఆస్తి ఎంత? తనఖా పెట్టి మరీ అంత ఖర్చు దానిపై ఎందుకు పెడుతోంది?

తమన్నా  తాజాగా ముంబయిలోని తన మూడు ఫ్లాట్స్‌ను తనఖాపెట్టి ఆ డబ్బుతో మరో చోట ఓ కమర్షియల్ ప్రాపర్టీని రెంట్‌కు తీసుకున్నట్లు తెలిసింది. 

3 Min read
Author : Surya Prakash
Published : Jul 03 2024, 06:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడంటే సినిమాలు స్పీడు తగ్గించింది కానీ ఒక టైమ్ లో తెలుగు,తమిళ సినిమాలను ఊపేసింది. స్టార్ హీరోలందరి సరసగా చేసింది. తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఆమెతో సినిమా చేస్తే గ్యారెంటీ హిట్ అనే నమ్మకం చాలా మంది హీరోల్లో నడిచింది. దాంతో ఏరి కోరి మరీ ఆమెనే తన సినిమాల్లో పెట్టుకునేవారు. అలాగే తమన్నా కూడా మంచి కథ అయితే చిన్న హీరో అయినా ఓకే చెప్పేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

 
 తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసిన తమన్నా ఓ టైమ్ లో ఇక్కడ ఆఫర్స్ తగ్గుతున్నాయంటే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ సీనియర్ హీరోల సరసన చేసిన ఆమె ఇప్పుడు వెబ్ సీరిస్ లలో దుమ్మురేపుతోంది. ఆ మధ్యన హిందీలో  ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది. కెరిర్ విషయం  ప్రక్కన పెడితే ఇప్పుడు ఆమె స్దిర,చరాస్దుల వేటలో పడింది.తాజాగా ముంబైలో ఓ ఆఫీస్ స్పేస్ ని భారీ రెంట్ కు తీసుకుంది. 
 

310


తమన్నా  తాజాగా ముంబయిలోని తన మూడు ఫ్లాట్స్‌ను తనఖాపెట్టి ఆ డబ్బుతో మరో చోట ఓ కమర్షియల్ ప్రాపర్టీని రెంట్‌కు తీసుకున్నట్లు తెలిసింది. దానికి నెలకు రూ.19లక్షల చొప్పున రెంట్‌ ఇచ్చేందుకు సిద్ధమైందట. ముంబయి జుహూ ఏరియాలోని వెస్టరన్ వైండ్ బిల్డింగ్‌లో 6వేల 65 చదరపు అడుగుల ప్రాపర్టీని అద్దెకు తీసుకుంది. 
 

410


ఈ ఆఫీస్ స్పేస్  కోసం రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. అలానే స్టాంప్ డ్యూటీగా రూ.2.9లక్షలు చెల్లించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి మూడేళ్ల తర్వాత నాలుగో సంవత్సరం నుంచి రూ.20.16 లక్షలు, ఐదో సంవత్సరం నుంచి రూ.20.96లక్షల అద్దె చెల్లించాలేలాగ ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. 
 

510

తమన్నా ముంబయిలోని తన మూడు ప్లాట్లను రూ.7.84 కోట్ల కోసం తనఖా పెట్టినట్లు తెలిసింది. వెస్ట్​ అంధేరీలోని లోఖంద్వాలాలో ఉన్న 2595 చదరపు అడుగులున్న ప్లాట్లను 2024 మే30నే మార్ట్‌గేజ్‌కు ఇచ్చిందట. వీటి కోసం రూ.4.7 లక్షల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీడియాలో వైరల్ అయ్యింది. 
 

610


ఈ నేపధ్యంలో  సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అయ్యింది.  నెటిజన్లు తమన్నా ఈ కమర్షియల్​ ప్రాపర్టీతో ఏం చేయబోతుందా అర్దం కాక తలపట్టుకుంటున్నారు. తమన్నా ప్రొడక్షన్ లోకి దిగి వెబ్ సీరిస్ లు నిర్మించబోతోందని, అందుకే ఆమె ఆఫీస్ స్పేస్ తీసుకుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
 

710

 తమన్నా  నెట్ వర్త్​ ప్రస్తుతం రూ.120 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇంక రిటైర్ అయ్యిపోయిందనుకున్న టైమ్ లో మళ్లీ బిజీ అవటం మొదలెట్టింది. యంగ్ హీరోయిన్స్ తో పోటి పడుతూ.. ఈ మధ్య సినిమాలలో వరుస బోల్డ్ రోల్స్​, గ్లామర్​ షోలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది .స్పెషల్ సాంగ్స్​ కూడా చేస్తోంది. 
 

810

ఈ మధ్య కాలంలో లస్ట్ స్టోరీస్, బాంద్రా, జైలర్, భోళాశంకర్, అరణ్మనై 4 వంటి చిత్రాలతో అలరించింది. ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్​ నువ్వు కావాలయ్యా పాటకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అరణ్మనైలోనూ గ్లామర్ షో బానే చేసింది. ఇలా ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్​గా బాక్​ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం వేద, స్త్రీ 2, ఒదెల 2 చిత్రాల్లో నటిస్తోంది. 

910


ఇదిలా ఉండగా తమన్నా కి సౌత్ లో మెల్లగా ఆఫర్స్ తగ్గడంతో ఆమె పూర్తిగా నార్త్ కి పరిమితం అయ్యిపోయి పలు బోల్డ్ సిరీస్ లు కూడా చెయ్యడానికి వెళ్ళింది. అలా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లు కూడా ఆమె చేసింది. కాగా ఈ సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ లో తనకు పార్ట్నర్ గా నటించిన ప్రముఖ నటుడు విజయ్ వెర్మ తో చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉంది.

1010
Tamannaah Bhatia

Tamannaah Bhatia


తమన్నా, విజయ్ వర్మ  ఆ సిరీస్ నుంచే మంచి ఫ్రెండ్ అయ్యి   ప్రేమలో పడ్డారని కూడా టాక్  . అక్కడ నుంచి వీరిద్దరూ బహిరంగంగానే కనిపిస్తూ వచ్చారు. దీనితో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే వీరు రిలేషన్ మొదలు పెట్టి దాదాపు రెండు సంవత్సరాలు దాటింది కానీ ఇంకా పెళ్లి ఊసు లాంటివి ఎప్పుడూ రాలేదు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved