బిగ్ బాస్ హౌస్ లో తమన్నా.. పొరపాటా..? గ్రహపాటా..?

First Published Aug 7, 2019, 11:40 AM IST

బిగ్ బాస్ లాంటి షోలు హిట్ అవ్వడానికి ముఖ్యకారణం, సెలెబ్రిటీల జీవనశైలిని తెలుసుకోవాలనే సగటు ప్రేక్షకుడి ఆసక్తి. వారు ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ప్రవర్తిస్తారు, వారు మానసికంగా ఎంత ధృడంగా ఉంటారు వంటి అంశాలను వ్యూయర్స్ తెలుసుకోవాలని చాలా ఇష్టపడతారు. 

బిగ్ బాస్ - ఆడియన్స్ లో మాంచి  క్రేజ్ ఉన్న షో. తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకొని విజయవంతంగా మూడో సీజన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ షో పట్ల గత వారం రోజులుగా జనాల్లో ఉత్సవాహం తగ్గుతున్నట్టుగా కనపడుతుంది. దానికి ముఖ్య కారణం వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన తమన్నా సింహాద్రి. తను వచ్చినప్పటినుంచి అక్కడ తిట్ల పురాణం తప్ప ఏదీ వినపడట్లేదు.

తాను తనకు స్క్రీన్ స్పేస్ ఇలా మాత్రమే దక్కుతుంది అని భావించిందో లేక ఏమో కానీ తను పదే పదే ఒకరిని కాకపోతే మరొకరిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఈ షోలో మునుపెన్నడూ గొడవలు జరగలేదని కాదు, కాకపోతే వారు చాలా హుందాగా వ్యవహరించేవారు. తాను మాత్రం కేవలం తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనపడుతుంది.

బిగ్ బాస్ లాంటి షోలు హిట్ అవ్వడానికి ముఖ్యకారణం, సెలెబ్రిటీల జీవనశైలిని తెలుసుకోవాలనే సగటు ప్రేక్షకుడి ఆసక్తి. వారు ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ప్రవర్తిస్తారు, వారు మానసికంగా ఎంత ధృడంగా ఉంటారు వంటి అంశాలను వ్యూయర్స్ తెలుసుకోవాలని చాలా ఇష్టపడతారు. అంతెందుకు ఏదైనా పండుగప్పుడు ఛానల్ వారు సెలెబ్రిటీలతో నిర్వహించే స్పెషల్ షోస్ టి ఆర్ పి రేటింగ్ గణనీయంగా ఉండడానికి కూడా ఇదే కారణం.

ఇలాంటి షోలో తమన్నా సింహాద్రి వంటి వారిని తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఇక్కడేదో ట్రాన్స్ జెండర్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నామని కాదు తన క్రెడిబిలిటీ ఏంటి? తను ఎం సాధించింది? బిగ్ బాస్ యాజమాన్యం ఏదో ఒక వడపోత పద్ధతినైతే పాటించి ఉంటుంది కదా.

లైంగిక వేధింపులు అని కొందరు సెలెబ్రిటీలు కోర్టుకెక్కారు అంటే ఖచ్చితంగా ఉండే తీరుతుంది. మరివారు తమన్నా ప్రవర్తన ఎలాఉండబోతుందో అంతమాత్రం కనిపెట్టలేకపోయారా?

కొద్ది సేపు తమన్నా ట్రాన్స్ జెండర్స్ అభ్యున్నతి కోసం కృషి చేస్తుందనే అనుకుందాం. ఆలా చేసే వారి ప్రవర్తన షోలో ఉండేది ఇలానా? పదే పదే రవిని ఉద్దేశించి నువ్వు పప్పు, ఎందుకూ పనికిరావు అనడం ఏంటి? బిగ్ బాస్ అనేది చాల ఇండ్లలో కుటుంబమంతా కూర్చొని చూస్తారు. అది ప్రసారమయ్యేది కూడా ప్రైమ్ టైం లోనే.

ఇలాంటి పరిస్థితుల్లో తను ఆలా నువ్వు మగాడివేనా అనే మాటను  సెక్సిస్టు కామెంట్ అనకూడదా? పిల్లలతో కలిసి చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచించండి?

ఇప్పుడిప్పుడే సమాజం   అందరినీ కలుపుకుపోవడం నేర్చుకుంటుంది. ఇలాంటి  తరుణంలో ఈ తమన్నా లాంటి వారి ప్రవర్తన జనాల్లో ఉన్న అపోహలను తొలగించకపోగా , వాటిని  మరింతగా బలోపేతం చేసే విధంగా ఉంది. ట్రాన్స్ జెండర్స్ ను ఈ బిగ్ బాస్ షోకి తీసుకురావడం తప్పు కాదు. అది ఆహ్వానించదగిన గర్వించదగ్గ విషయం.

సెలెబ్రిటీల మధ్య వారు ఉన్నప్పుడు అంతా కలిసి జీవించడంవల్ల ప్రజల్లోకి చాలా మంచి మెసేజ్ పోయి కనీసం కొద్దిమందైనా ఆ వర్గంపట్ల వారికున్న అభిప్రాయాన్ని మార్చుకొని ఉండేవారు. కానీ ఇక్కడ తను చేస్తుందేమిటి?

పోయినసారి బాబు గోగినేని ఉన్నారు అంటే తాను చెప్పాలనుకున్న మెసేజ్ ను ఎంతో కొంత మేర ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎప్పుడైనా తమన్న తను ట్రాన్స్ జెండర్స్ కోసం ఎలా ఫైట్ చేస్తున్నానో చెప్పిందా? వారి ఎన్నో సంవత్సరాల కల ట్రాన్స్ జెండర్స్ ను ఓ బి సి ల్లో చేర్చడం. ఎన్నడైనా దాని గురించి ప్రజలకు తెలిసేలా మాట్లాడిందా? ఇవేవి చేయకపోగా ఒకరకంగా తను హౌజ్ లోని మిగితా కంటెస్టెంట్లను టెర్రరైస్ చేస్తుంది.

గత వారం తమన్నా తప్పులను నాగ్ సరిగ్గా ఎత్తి చూపెట్టలేకపోయాడు. ఇక్కడ మరోసారి తారక్ అయితే బాగుండు అని ప్రేక్షకులంతా భావించారు.

బిగ్ బాస్ నిర్వాహకులకు వేరే స్ఫూర్తిప్రదాయక  ట్రాన్స్ జెండర్స్ దొరకలేదా? డాక్టర్ల నుండి సొంత వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించే ఎందరో ఉన్నారు. ఎన్ జి ఓ లను నడుపుతూ వాటి ద్వారా ఎందరినో ఉన్నత చదువులు చదివించే మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వీరెవరినీ కాదని, పూర్తి ట్రాన్స్ జెండర్స్ వర్గానికే అపవాదు తెచ్చే ప్రమాదంగా పరిణమించిన ఈ తమన్నా ను తీసుకురావడం వారి పొరపాటో లేక గ్రహపాటో!

మొత్తానికి నెటిజన్లు మాత్రం తమన్నాను వెంటనే ఎలిమినేట్ చేయాలని తెగ పోస్టులు పెడుతున్నారు. ప్రజల్లో తమన్నాపై పెరుగుతున్న నెగటివిటీ, షో పట్ల కొద్దీ కొద్దిగా తగ్గుతున్న ప్రేక్షకుల ఇంటరెస్ట్ దృష్ట్యా ఈ వారం తమన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?