- Home
- Entertainment
- న్యూయార్క్ లో తాప్సి దేశీ లుక్, రోడ్లపై యమా స్టైల్ గా తిరుగుతూ.. వైరల్ అవుతున్న సొట్టబుగ్గల సుందరి ఫొటోస్
న్యూయార్క్ లో తాప్సి దేశీ లుక్, రోడ్లపై యమా స్టైల్ గా తిరుగుతూ.. వైరల్ అవుతున్న సొట్టబుగ్గల సుందరి ఫొటోస్
ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది.
తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు యమా స్టైలిష్ గా ఉన్నాయి. ప్రస్తుతం తాప్సి న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. న్యూయార్క్ నగరంలో దేశీ లుక్ తో తాప్సి రచ్చ చేస్తోంది.
చీరకట్టులో స్టయిల్ గా ఎలా ఉండాలో తాప్సి నేర్పుతోంది. కాఫీ షాప్ లో, రోడ్లపై తిరుగుతూ తాప్సి ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు తాప్సి యాంటీ బార్ పర్సన్ అని కామెంట్ పెట్టింది. అంటే ఆమెకు బార్ లోకి వెళ్లి మధ్యం సేవంచడం నచ్చదు.. ఇలా కాఫీ ఎంజాయ్ చేయడం ఇష్టం అని అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.
తాప్సి చివరగా దోబారా, శభాష్ మిథు లాటి చిత్రాల్లో నటించింది. తాప్సి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతోంది. టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇప్పటికీ తాప్సి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది. కానీ సౌత్ లో కంటే ఆమెకు నార్త్ లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి గ్లామర్ రోల్స్ కంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.