- Home
- Entertainment
- ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేశావ్ స్వీటీ.. అనుష్క శెట్టిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్..
ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేశావ్ స్వీటీ.. అనుష్క శెట్టిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) తాజాగా పోస్ట్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ పిక్ ను చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు కూడా ఈ ఫొటో ఎంటీ స్వీటీ అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు పోటీగా.. వారికి సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ అనుష్క శెట్టి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో హడావిడి చేసింది అనుష్క. స్టార్ హీరోలకు జోడీగా సూపర్ హిట్ ఫిల్మ్స్ లో మెరిసిన బ్యూటీ.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో దుమ్మురేపింది.
ముఖ్యంగా అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. చివరిగా ‘నిశ్శబ్దం’తో అలరించింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బహుబలి’(Bahubali) తర్వాత అనుష్క ఈ ఒక్క చిత్రంలోనే కనిపించింది. ఆ తర్వాత ఎలాంటి సినిమాకు సంతం చేసినట్టు లేదు.
చాలా కాలంగా అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తోంది. తన పర్సనల్ విషయాలను అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంటూ వస్తోంది.
చివరిగా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా పలు పిక్స్ ను పోస్ట్ చేసింది. హార్ట్ ఫెల్ట్ నోట్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్ పిక్స్ ను పంచుకుంది. తాజాగా అనుష్క శెట్టి సోదరుడు సాయి రమేశ్ శెట్టి పుట్టిన రోజు సందర్బంగా తాజాగా మరోసారి సోషల్ మీడియాలో మెరిసింది.
తన సోదరుడికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ పోస్ట్ పెట్టింది. ‘జన్మదిన శుభాకాంక్షలు సోదర సాయి రమేశ్ శెట్టి’ అని క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ సందర్భంగా తన సోదరుడితో ఉన్న పిక్ ను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్ చాలా బ్లర్ గా ఉంది. మసకగా ఉండటంతో వారి మెహాలు ఏమీ కనిపించడం లేదు.
దీంతో నెటిజన్లు అనుష్క పోస్ట్ ను చూసి క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు తన సోదరుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూనే... మరోవైపు ఇలాంటి సందర్భంలోనూ మసకగా ఉన్న ఫొటోను ఎందుకు పోస్ట్ చేశావు స్వీటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరే పిక్ లేదా? అని అడుగుతున్నారు.