ప్రియుడు రోహ్మాన్‌తో ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రపంచ సుందరి సుస్మిత
బాలీవుడ్ అందాల భామ సుస్మితా సేన్ ప్రేమకి వయసుతో పనిలేదని చెబుతోంది. శరీరం వేరు, మనసు వేరని చెబుతోంది. తన కంటే తక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది. తాజాగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుని ప్రపంచ సుందరిగా పాపులర్ అయిన సుస్మితా సేన్ ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గాని నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
హైదరాబాద్‌కి చెందిన సుస్మితా సేన్ మోడల్‌గా కెరీర్‌ని పక్కన పెట్టిన తర్వాత బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. అనేక బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం తగ్గని సుస్మిత బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను ఏర్పర్చుకుంది.
సుస్మితా సేన్ తాజాగా తన లవ్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ప్రేమకి హద్దుల్లేవని వెల్లడించింది. తన రొమాంటిక్ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేస్తుందో వెల్లడించింది.
44ఏళ్ళ సుస్మితా.. 27ఏళ్ళ రోహ్మాన్ షాల్ తో ప్రేమలో మునిగి తేలుతుంది. వీరిద్దరి మధ్య 17ఏళ్ల గ్యాప్ ఉంది. వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మిత తన ప్రేమ, డేటింగ్ వ్యవహారాలను వెల్లడించింది. తమ ప్రేమ ఎలా చిగురించిందో తెలిపింది. తమది ఎంతో అందమైన ప్రేమ కథ అని తెలిపింది. అతను మొదట నాకు డైరెక్ట్ గా ఇన్‌గ్రామ్‌కి సందేశాన్ని పంపించాడు. కానీ వాటిని నేను చూడను. ఒకవేళ వాటిని చూస్తే ఆ వ్యక్తితో కమ్యూనికేషన్‌కి అనుమతించినట్టు అవుతుంది. ఇలా డైరెక్ట్ గా నాకు చాలా సందేశాలు వస్తాయి. అవన్నీ చూడలేను.
టచ్ ఫోన్‌లో నాకు ఏం మెసేజ్‌లు వచ్చాయో చూసుకుంటూ వెళ్తున్నా. ఆ సమయంలో ఈ కుర్రాడి వీడియో కనిపించింది. అందులో అతను ఏదో పగుల కొట్టాడు. దీంతో దాన్ని ఓపెన్ చేశాను. అతని నుంచి నాకో మెసేజ్ వచ్చింది. `ఓ మై గాడ్. నేను దాన్ని ఎలా చేశాను. దేవుడు నేను ఫోన్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ మాట్లాడకూడదు` అని ఉంది. అందుకు నేను స్పందించాను. `చాలా ధన్యవాదాలు. మీ సందేశం నా రోజుని చేసింది. చాలా ఆనందించాను` అని పేర్కొన్నా.
ఆ తర్వాత అ కుర్రాడు రెస్పాండ్ అయ్యాడు. `మీరు స్పందించారని తెలిసి నేను ఒక గది నుంచి మరొక గదిలోకి దూకుతున్నాను. మీరు స్పందించారని నమ్మలేకపోతున్నా` అని పేర్కొన్నాడు. అప్పుడు అతని గురించి క్రమంగా తెలుసుకున్నాను. ఇదంతా నేను యూఎస్‌నుంచి తిరిగి వచ్చే టైమ్‌లో జరిగింది. అతను వచ్చాక ఫుట్‌బాల్ ఆడేందుకు నన్ను ఆహ్వానించాడు. తాను ఫుట్‌బాల్ ఆడుతుంటే సుస్మితాని చూడమని చెప్పాడట. కానీ సుస్మితా అతన్ని కాఫీకి రమ్మని పిలిచిందట. అలా కలిసినప్పుడు అతని గురించి తెలుసుకుని ఫిదా అయ్యిందట.
అలా క్రమంగా అతనిపై ఆసక్తి పెరిగిందని, అది డేటింగ్‌కి దారి తీసిందని, అతనితో లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. గత రెండేళ్ళుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అన్నట్టు సుస్మిత ఇద్దరు అమ్మాయిలు రినీ, అలిషాలను దత్తత తీసుకుంది.