MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అటకెక్కిన సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్.. అప్పట్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు, ఇప్పుడు రాజమౌళికి మాత్రమే సాధ్యం

అటకెక్కిన సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్.. అప్పట్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు, ఇప్పుడు రాజమౌళికి మాత్రమే సాధ్యం

విలక్షణ నటుడు సూర్యకి తన కెరీర్ లో అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువా చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రంతో నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 23 2024, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

విలక్షణ నటుడు సూర్యకి తన కెరీర్ లో అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువా చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రంతో నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Suriya

Suriya

తమిళ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజింగ్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఒక రేంజ్ లో ఈ చిత్రం గురించి చెప్పారు. సూర్య ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డాడు. ఎవ్వరి కష్టానికి ఫలితం దక్కలేదు. ఈ ప్రభావం సూర్య తదుపరి చిత్రాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. 

35

నిర్మాతని ఆదుకునేందుకు సూర్య తదుపరి చిత్రం కూడా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలోనే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్ఞానవేల్ రాజా నష్టాలని భరించేందుకు సూర్య రెమ్యునరేషన్ లేకుండా మరో చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సూర్య డ్రీమ్ ప్రాజెక్టు కూడా కంగువా ఎఫెక్ట్ తో ఆగిపోయినట్లు టాక్. 

45

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ లో మహాభారతం ఆధారంగా కర్ణుడి పాత్రతో 'కర్ణ' అనే చిత్రం చాలా కాలం క్రితం సూర్య హీరోగా ఖరారైంది. భాగ్ మిల్కా భాగ్ చిత్ర దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఈ చిత్రానికి ప్లానింగ్ కూడా జరిగింది. మహాభారతంలో కర్ణుడి పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాత్రలో ఉండే ఎమోషన్ కి ఆడియన్స్ ఫిదా అవుతారు. కల్కి ఆ తరహా ఎమోషన్ తో వచ్చి ఆడియన్స్ ని ఫిదా చేసింది. 

55
Rajamouli

Rajamouli

అయితే సూర్య, ఓం ప్రకాష్ కర్ణ చిత్రం కంగువా డిజాస్టర్ కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. కంగువాకి భారీ నష్టాలు ఎదురయ్యాయి. దీనితో కర్ణ చిత్రానికి 500 కోట్లు పెట్టడం సాధ్యం కాదు అని నిర్మాతలు వెనుకడుగు వేశారు. దీనితో ఈ చిత్రం రద్దయినట్లు బాలీవుడ్ లో టాక్. గతంలో కర్ణుడి పాత్ర అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. దానవీర శూర కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన స్వీయ దర్శకత్వంలో దానవీర శూర కర్ణ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు మహాభారతం నేపథ్యంలో అలాంటి చిత్రం తెరకెక్కించాలి అంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image2
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Recommended image3
Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved