గుండు గీయించుకున్న సురేఖా వాణి... అమ్మో ఇలా తయారయ్యిందేంటి?
నటి సురేఖా వాణి గుండు చేయించుకోవడం సంచలనంగా మారింది. ఆమె షాకింగ్ లుక్ వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
Surekhavani
సురేఖా వాణి పరిచయం అక్కర్లేని పేరు. లేడీ కమెడియన్ గా పలు చిత్రాల్లో ఆమె నటించారు. భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, నమో వెంకటేశ చిత్రాల్లో సురేఖావాణి నటనకు ప్రశంసలు దక్కాయి.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gpan6t0xzj5xa55d2vsm4vfq/snapinsta-app-1080-323954047-533802978784344-3749735103385904727-n-jpg_300x300xt.jpg)
సురేఖా వాణి ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ పై తక్కువగా కనిపిస్తున్నారు. ఆమెకు ఆఫర్స్ అంతగా రావడం లేదు. 2019లో సురేఖావాణి భర్త సురేష్ తేజ మరణించాడు. భర్త మరణంతో సురేఖావాణి గ్యాప్ తీసుకుంది. అలాగే 2020 లో లాక్ డౌన్ రావడంతో ఆమె మరింతగా సినిమాలకు దూరమయ్యారు.
సురేఖావాణి సోషల్ మీడియాలో మాత్రం బిజీ. ఆమె రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సురేఖా వాణి కూతురు సుప్రీత ఫైర్ అయ్యారు. మీ ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాయకండని మండిపడింది.
ఇక సురేఖా వాణి - సుప్రీత కలిసి వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంటారు. తల్లీ కూతుళ్ళ మాదిరి కాకుండా ఫ్రెండ్స్ వలె మెలుగుతారు. సురేఖావాణికి గ్లామరస్ ఇమేజ్ ఉంది. సురేఖావాణి వీడియోలు, ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.
Surekhavani
అలాంటి సురేఖావాణి గుండు చేయించుకోవడం సంచలనమైంది. సురేఖావాణి గుండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కూతురుతో పాటు తిరుమల వెళ్లిన సురేఖావాణి తలనీలాలు సమర్పించింది. దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో ఆమె కనిపించారు.
మరోవైపు కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనే ఆలోచనలో ఉంది. సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కలిగి ఉంది. మరి హీరోయిన్ కావాలన్న ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలితం ఇస్తాయో చూడాలి.