రాజమౌళికి కండీషన్ పెట్టిన మహేష్ బాబు, ఆవిషయంలో విసిగిపోయాడట
ఏడాదికి ఒక్క సినిమా చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్. ఈ ఏడాది సర్కారువారి పాట సినిమాతో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నెక్ట్స్ రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు మహేష్. టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో సినిమా కన్ ఫార్మ్ చేసిన మహేష్.. జక్కన్నకు ఓ కండీషన్ పెట్టాడంట.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో మాస్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా కోసం కాదు.. మహేష్ ను ఒక్కసారి చూడాలి అనుకుని సినిమాకు వెళ్ళే అభిమానులు ఎక్కువగా ఉంటారు. అందుకే అభిమానులకు నచ్చే విధంగా సినిమాలు చేస్తుంటాడు సూపర్ స్టార్.
రీసెంట్ గా పరశురామ్ డైరెక్షన్ లో సర్కారువారి పాట సినిమా చేసిన మహేష్ బాబు.నెక్ట్స్ త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడో సారి సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇక ఆతరువాత రాజమౌళి సినిమాను లైన్ లోకి తీసుకోబోతుననాడు సూపర్ స్టార్. అయితే జక్కన్న సినిమా విషయంలో ఒక విషయంలో మాత్రం రాజౌళికి చిన్న సజెషన్ ఇచ్చాడట మహేష్.
మహేష్ కెరీర్ లో అత్యధికంగా...బాలీవుడ్ ముద్దు గుమ్మలే ఆయన పక్కన హీరోయిన్ గా కనిపించారు. హీరోగా మహేష్ మొదటి సినిమా రాజకుమారుడులో బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా నటించింది. తర్వాత టక్కరిదొంగలో బిపాషా బసు, లీసా రే నటించారు. వీరిద్దరూ కూడా బాలి వుడ్ కి చెందిన వారే కావడం విశేషం. ఇలా చెప్పుకుంటే పోతే సోనాలి బింద్రే, అదితి రావు, కృతి సనన్ మొదలైన బాలీవుడ్ భామలు మహేష్ పక్కన ఆడి పాడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ అయితే వంశీ సినిమాలో మహేష్ తో హీరోయిన్ గా చేసి.. ఆయన జీవిత భాగస్వామిగా మారింది. అమ్మాయిల కలల రాకుమారిడిని సొంతం చేసుకుంది. అయితే ఇపుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటి అంటే మహేష్ రాజమౌళి తో చేయబోయే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ వద్దని, టాలీవుడ్ హీరోయిన్ లకే ప్రాధాన్యం ఇవ్వమని రాజ మౌళిని కోరినట్టు తెలుస్తుంది.
గత సినిమాల్లో వరుసగా బాలీవుడ్ హీరోయిన్ లతో పని చేసిన మహేష్ వాళ్లతో విసిగిపోయాడట. వాళ్ల కాల్షీట్ ల ఇబ్బంది, వాళ్ల డిమాండ్స్, వాళ్ల ఫెసిలిటీస్, వాళ్లు పెట్టె షరతులకి విసుగు చెంది మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే రాజమౌళి ఈ సినిమా లో నటించే నటీనటుల వివరాలు వెల్లడించే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. మరో విషయం ఏంటీ అంటే.. హీరోయిన్ క్యారెక్టరే కాదు.. ఏ పాత్ర అయినా.. తన ఊహా చిత్రంలో.. కథకు ఎవరు సూట్ అయితే వాళ్లనే తీసుకుంటాడు జక్కన్న. మరి మహేష్ పక్కన,కథకు సరిపడా ఎవరిని అనుకున్నాడో ఏంటో. ఒక వేళ బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నా.. మరి మహేష్ కోసం కాంప్రమైజ్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్. ఈ మూవీ అయిపోయిన వెంటనే.. రాజమౌళితో పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు మహేష్. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. సినిమాను అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.