రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒక్కొక్కటిగా తన బిజినెస్ లను నెలకొల్పుతున్నారు. తాజాగా హోటల్ బిజినెస్ లోనూ అడుగుపెట్టబోతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటు సినిమాలతో పాటు.. అటు బిజినెస్ లపైనా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇప్పటికే సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ (GMB)ను స్థాపించి రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన ‘మేజర్’(Major)ను నిర్మించిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు మరికొద్ది రోజుల్లోనే హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారంట. మరెక్కడో కాకుండా హైదరాబాద్ లోనే నెలకొల్పబోతున్నట్టు తెలుస్తోంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోనే రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నారు.
అటు సినిమాలు.. ఇటు బిజినెస్ లతో పాటు సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు చికిత్స చేయిస్తూ పేదల ఆశీస్సులను సొంతం చేసుకుంటున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లో పలు షాపింగ్ మాల్స్, ఖరీదైన బిల్డింగ్స్ ను సొంతం చేసుకున్న మహేశ్ బాబు.. బిజినెస్ లపై మరింత ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఇండస్ట్రీలో ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ విదేశంలో రెస్టారెంట్ ను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను అలరించిన మహేశ్ బాబు.. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటించనున్నారు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.