టాలీవుడ్ స్టార్ హీరో మూవీని మధ్యలోనే ఆపమని చెప్పిన రజనీ, సూపర్ స్టార్ చెప్పినా వినకపోతే ఇలానే ఉంటుంది
ఓ టాలీవుడ్ నిర్మాతకి రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. కానీ ఆ నిర్మాత రజనీ మాటల్ని పెడచెవిన పెట్టారు. దాని ఫలితం ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంది హీరోలకు, నిర్మాతలకు తనకి తోచిన మంచి సలహాలు ఇస్తుంటారు. రజనీకాంత్ కి టాలీవుడ్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిరంజీవి, మోహన్ బాబు లాంటి హీరోలతో మాత్రమే కాదు, బడా నిర్మాతలతో కూడా ఆయనకి స్నేహం ఉంది. ఓ టాలీవుడ్ నిర్మాతకి రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. కానీ ఆ నిర్మాత రజనీ మాటల్ని పెడచెవిన పెట్టారు. దాని ఫలితం ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

rajiniikanth, jr ntr
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో అశ్విని దత్ ఒకరు. అశ్విని దత్ పేరు చెప్పగానే చిరంజీవితో ఆయన నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అశ్విని దత్ జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. విజయవాడకి చెందిన ఒక జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే తన కెరీర్ సాగుతూ వచ్చింది అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కొన్నిసార్లు ఆ జ్యోతిష్యుడు మాటలని పెడచెవిన పెట్టడం వల్ల బాగా నష్టం వచ్చింది అని పేర్కొన్నారు. 2010లో ఆ జ్యోతిష్యుడిని మరోసారి అశ్విని దత్ కలిశారట. ఏవయ్యా నీకు ఇక నుంచి ఏలినాటి శని మొదలు కాబోతోంది. ఒక ఏడేళ్లు సినిమాలు తీయకు. 2017 నుంచి సినిమాలు మొదలుపెట్టుకో. బాగా కలసివస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం సినిమాల జోలికి వెళ్లొద్దు అని చెప్పారు. చేయగలిగేవి చెబితే పాటిస్తాం కానీ ఇలా ఏడేళ్లు సినిమాలు మానేయమంటే ఎలా.. నా వృత్తే అది కదా అని అశ్విని దత్ మనసులో అనుకున్నారు.
వెంటనే జూనియర్ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో శక్తి చిత్రాన్ని ప్రారంభించారు. నిజంగా ఏలినాటి శని ఉంటే ఎంత మంది ఎన్ని మాటలు చెప్పినా తలకి ఎక్కవు. శక్తి చిత్రం శక్తి పీఠాలకు సంబంధించినది. నా భార్య కూడా వద్దని హెచ్చరించినా వినలేదు.
శక్తి షూటింగ్ దశలోనే ఉన్నప్పుడు నేను బాగా అభిమానించే బెస్ట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిశాను. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నావు దత్ అని అడిగారు. ఈ విధంగా శక్తి పీఠాలకు సంబంధించిన శక్తి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాను అని చెప్పాను. రజనీకాంత్ గారు వెంటనే వద్ద.. వద్దు.. అమ్మవారి పేరుపై అలాంటి సినిమా వద్దు వేంటనే ఆపేయ్ అని చెప్పారు. లేదు సార్ ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది అని చెప్పాను. అవునా అయితే కనీసం పూజలు అయినా బాగా చేయి అని చెప్పారు. ఏం చేసినా ఎంత చేసినా ఫలితం లేదు. ఆ ఒక్క చిత్రంతో దాదాపుగా 25 కోట్లు నష్టం వచ్చింది. కెరీర్ లో చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అని అశ్విని దత్ అన్నారు.

