- Home
- Entertainment
- మీనా కూతురు మాటలకి కన్నీరు పెట్టుకున్న రజనీకాంత్..నాన్న మరణం, అమ్మ గురించి అబద్దాలు అంటూ
మీనా కూతురు మాటలకి కన్నీరు పెట్టుకున్న రజనీకాంత్..నాన్న మరణం, అమ్మ గురించి అబద్దాలు అంటూ
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం అభినయంతో సౌత్ లో మీనా చెరగని ముద్ర వేసింది.

Meena
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం అభినయంతో సౌత్ లో మీనా చెరగని ముద్ర వేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్, వెంకటేష్ ఇలా సౌత్ స్టార్ హీరోలందరి సరసన మీనా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
2009లో మీనా బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే ముద్దుల కుమార్తె జన్మించింది. నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. విజయ్ తేరి చిత్రంలో అతడి కుమార్తె గా ముద్దు ముద్దుగా నైనిక అద్భుతంగా నటించింది.
అయితే మీనా కుటుంబంలో గత ఏడాది అనుకోని విషాదం జరిగింది. మీనా భర్త విద్యాసాగర్ గత ఏడాది జూన్ లో ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించారు. దీనితో మీనా విషాదంలో కూరుకుపోయింది. అయితే భర్త మరణం తర్వాత మీనాపై అనేక రూమర్స్ వినిపించాయి. మీనాని బ్లేమ్ చేస్తూ పుకార్లు కూడా వచ్చాయి. భర్త మరణించిన కొద్ది రోజులకే మీనా రెండవ వివాహానికి రెడీ అవుతుందని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తలని మీనా సన్నిహితులు ఖండించారు. ఇటీవల మీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభినందించేందుకు గత నెలలో చెన్నైలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్ప్రైజింగ్ గా మీనా కూతురు నైనికా మాట్లాడిన వీడియో బైట్ ప్లే చేశారు.
Meena Vidyasagar
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభుదేవా, రాధికా లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నైనికా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నైనిక మాటలకు రజనీకాంత్ సైతం కంటతడి పెట్టుకున్నారు. 'అమ్మా నువ్వు ఈ స్థాయికి ఎంతో కష్టపడి వచ్చావు. నటిగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాయి. కానీ ఆ కష్టాన్ని ఇంట్లో ఎప్పుడూ చూపించలేదు. నన్ను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. చిన్నప్పుడు నేను నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను.
ఇకపై నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్న మరణించాక అంతా చీకటిగా మారింది. నువ్వు మానసికంగా ఎంత కుంగిపోయావో నాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు నీ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దయచేసి అలా చేయొద్దు. ఆ అమ్మ కూడా మనిషే. ఆమెకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి' అంటూ నైనిక ఎమోషనల్ గా మాట్లాడింది. నైనిక మాటలకు మీనా, రజనీకాంత్ సహా అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. నైనిక మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.